చేకొని వూడిగములు సేసేవారి పైనే బత్తి
(॥పల్లవి॥)
చేకొని వూడిగములు సేసేవారి పైనే బత్తి
యీకాలము దొరలకు నేమిచెప్పే మిఁకను
(॥చేకొ॥)
తచ్చితచ్చి యాపె నీపాదాలు గుద్దెనంటాను
మెచ్చిమెచ్చి పొగడుతా మేలమాడేవు
కొచ్చికొనగొర నీకొప్పు దువ్వెనంటాను
యిచ్చగించి తమ్ములము యీవిగా నిచ్చేవు
(॥చేకొ॥)
కలికి నీమర్మాలంటి గందము వూసెనంటాను
చెలరేఁగి యాపెమీఁద జేయిచాఁచేవు
పలుమారు నేకతాన బాగా లొసఁగెనంటా
అలమి చెక్కులునొక్కి యాదరించేవు
(॥చేకొ॥)
చెనకుచుఁ జెప్పరానిసేవలెల్లాఁ జేసెనంటా
కనుఁగొని నవ్వునవ్వి కాఁగిలించేవు
యెనసితివి శ్రీవేంకటేశ యీమాటకు నన్ను
మనసిచ్చి యాపెను నామారుగాఁ జూచేవు
(||pallavi||)
segŏni vūḍigamulu sesevāri paine batti
yīgālamu dŏralagu nemisĕppe mim̐kanu
(||segŏ||)
tachchidachchi yābĕ nībādālu guddĕnaṁṭānu
mĕchchimĕchchi pŏgaḍudā melamāḍevu
kŏchchigŏnagŏra nīgŏppu duvvĕnaṁṭānu
yichchagiṁchi tammulamu yīvigā nichchevu
(||segŏ||)
kaligi nīmarmālaṁṭi gaṁdamu vūsĕnaṁṭānu
sĕlarem̐gi yābĕmīm̐da jeyisām̐sevu
palumāru negadāna bāgā lŏsam̐gĕnaṁṭā
alami sĕkkulunŏkki yādariṁchevu
(||segŏ||)
sĕnagusum̐ jĕpparānisevalĕllām̐ jesĕnaṁṭā
kanum̐gŏni navvunavvi kām̐giliṁchevu
yĕnasidivi śhrīveṁkaḍeśha yīmāḍagu nannu
manasichchi yābĕnu nāmārugām̐ jūsevu