Segoni voodigaalellaam jeyimchugonavayyaa

చేకొని వూడిగాలెల్లాఁ జేయించుకొనవయ్యా
Language

(॥పల్లవి॥)
చేకొని వూడిగాలెల్లాఁ జేయించుకొనవయ్యా
యీ కడఁ గొలువవచ్చె నిదివో నిన్నును

(॥చేకొ॥)
పంతగాండవై వొంటి నీపానుపుపై నుండఁగాను
మంతనమాడవచ్చెను మగువ
చెంతల నీ మేనెల్లాఁ జెమరించియుండఁగాను
ఇంతలో విసరవచ్చె నిదివో నీకును

(॥చేకొ॥)
గరిమతో సంతోసానఁ గడుమించి నీవుండఁగా
సరసములాడవచ్చె సకియ
తరుణలపైఁ గాంక్ష తలపోయుచుండఁగాను
అరుదుగా నిన్ను బెండ్లాడవచ్చె నిపుడు

(॥చేకొ॥)
ఆదిగొని నిద్రలేచి ఆనందాన నుండఁగాను
పాదము లొత్తఁగ వచ్చెఁ బడఁతి
యీదెస శ్రీవేంకటేశ ఇంతి నిట్టె కూడితివి
మోధముతోడుత నీకు మొక్కవచ్చెఁగూర్మిని

(||pallavi||)
segŏni vūḍigālĕllām̐ jeyiṁchugŏnavayyā
yī kaḍam̐ gŏluvavachchĕ nidivo ninnunu

(||segŏ||)
paṁtagāṁḍavai vŏṁṭi nībānububai nuṁḍam̐gānu
maṁtanamāḍavachchĕnu maguva
sĕṁtala nī menĕllām̐ jĕmariṁchiyuṁḍam̐gānu
iṁtalo visaravachchĕ nidivo nīgunu

(||segŏ||)
garimado saṁtosānam̐ gaḍumiṁchi nīvuṁḍam̐gā
sarasamulāḍavachchĕ sagiya
taruṇalabaim̐ gāṁkṣha talaboyusuṁḍam̐gānu
arudugā ninnu bĕṁḍlāḍavachchĕ nibuḍu

(||segŏ||)
ādigŏni nidralesi ānaṁdāna nuṁḍam̐gānu
pādamu lŏttam̐ga vachchĕm̐ baḍam̐ti
yīdĕsa śhrīveṁkaḍeśha iṁti niṭṭĕ kūḍidivi
modhamudoḍuda nīgu mŏkkavachchĕm̐gūrmini