Segoni neesevalellaam jesemgaani

చేకొని నీసేవలెల్లాఁ జేసేఁగాని
Language

(॥పల్లవి॥)
చేకొని నీసేవలెల్లాఁ జేసేఁగాని
యీకడ నిట్టె నీవు మాయింటికి రావయ్య

(॥చేకొ॥)
గొల్లెతలు వలచిరి కోరినట్టెసేసితివి
చెల్లునయ్య నీచేసినచేఁత లెల్లాను
మెల్లనే నీవంటుకోఁగామేమిఁకఁ గాదనేమా
ఇల్లిదివో వున్నది మా యింటికి రావయ్యా

(॥చేకొ॥)
పదిమారువేలింతులపతివైతి వెమ్మె మించె
యెదురు లేదయ్య నీకు నేమిటాను
వుదుటునఁ జెనకఁగా వోపననేమా నేము
యెదిగెఁ జన్ను లిదె మా యింటికి రావయ్యా

(॥చేకొ॥)
పట్టపుదేవులు గద్దు పనులెల్లాఁ జక్కనాయ
తొట్టుకొంటివయ్య మేలు వొమ్ము నీకును
గుట్టున శ్రీవేంకటేశ కూడితి వేఁటికనేమా
యిట్టె నీపొరుగే మాయింటికి రావయ్యా

(||pallavi||)
segŏni nīsevalĕllām̐ jesem̐gāni
yīgaḍa niṭṭĕ nīvu māyiṁṭigi rāvayya

(||segŏ||)
gŏllĕdalu valasiri korinaṭṭĕsesidivi
sĕllunayya nīsesinasem̐ta lĕllānu
mĕllane nīvaṁṭugom̐gāmemim̐kam̐ gādanemā
illidivo vunnadi mā yiṁṭigi rāvayyā

(||segŏ||)
padimāruveliṁtulabadivaidi vĕmmĕ miṁchĕ
yĕduru ledayya nīgu nemiḍānu
vuduḍunam̐ jĕnagam̐gā vobananemā nemu
yĕdigĕm̐ jannu lidĕ mā yiṁṭigi rāvayyā

(||segŏ||)
paṭṭabudevulu gaddu panulĕllām̐ jakkanāya
tŏṭṭugŏṁṭivayya melu vŏmmu nīgunu
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidi vem̐ṭiganemā
yiṭṭĕ nībŏruge māyiṁṭigi rāvayyā