Segoni naagu buddulu seppe vappada numdi

చేకొని నాకు బుద్దులు చెప్పే వప్పట నుండి
Language

(॥పల్లవి॥)
చేకొని నాకు బుద్దులు చెప్పే వప్పట నుండి
జోకతోడ వేళలెల్లాఁ జూచి చెప్పుతా రావే

(॥చేకొని॥)
యేకతాన బతివద్ది కేరీతి నే వత్తునే
ఆకడ నెవ్వతె బిల్వనంపుకున్నాఁడో
కాక, తన్ను నెట్టా నిక్కడికి రమ్మందునే
కైకొని యే పనులకు గాచుకున్నాఁడో

(॥చేకొని॥)
కామించి కామించి యీతని కెట్టు గదిసి వీడెమిత్తునే
ప్రేమ నెవ్వతెఁ దెరలోఁ బెట్టుకున్నాఁడో
ఆముకొని పెనఁగఁగ నది యెట్టు గూడెనే
చేముంచి యిప్పు డాతని చిత్త మేడ నున్నదో

(॥చేకొని॥)
గక్కన నే నెటువలెఁ గాఁగిలించుకొందునే
అక్కర నే కాంతఁ బెండ్లి యాడినాడో
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోఁ దా నన్నేలె
తక్కక నామీఁద నెంత దయసేసినాఁడో

(||pallavi||)
segŏni nāgu buddulu sĕppe vappaḍa nuṁḍi
jogadoḍa veḽalĕllām̐ jūsi sĕppudā rāve

(||segŏni||)
yegadāna badivaddi kerīdi ne vattune
āgaḍa nĕvvadĕ bilvanaṁpugunnām̐ḍo
kāga, tannu nĕṭṭā nikkaḍigi rammaṁdune
kaigŏni ye panulagu gāsugunnām̐ḍo

(||segŏni||)
kāmiṁchi kāmiṁchi yīdani kĕṭṭu gadisi vīḍĕmittune
prema nĕvvadĕm̐ dĕralom̐ bĕṭṭugunnām̐ḍo
āmugŏni pĕnam̐gam̐ga nadi yĕṭṭu gūḍĕne
semuṁchi yippu ḍādani sitta meḍa nunnado

(||segŏni||)
gakkana ne nĕḍuvalĕm̐ gām̐giliṁchugŏṁdune
akkara ne kāṁtam̐ bĕṁḍli yāḍināḍo
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalom̐ dā nannelĕ
takkaga nāmīm̐da nĕṁta dayasesinām̐ḍo