Sega meerina panule sese vella

చేగ మీరిన పనులే సేసే వెల్ల
Language

(॥పల్లవి॥)
చేగ మీరిన పనులే సేసే వెల్ల
బాగు మీరఁ దన కది పై వచ్చే దెరఁగఁడూ

(॥చేగ మీరి॥)
సిగ్గు వడి తనుఁ జూచి సిరసు వంచుకొంటేను
దగ్గరి రమ్మంటి నంటా దండ చేరీని
వెగ్గళించ నైతిఁ గాక విదలించి వేసి నేను
బగ్గనఁ దిట్టితే తనభావము చూచీనా

(॥చేగ మీరి॥)
యెదుట నిలవుక నేనింటిలోని కేఁగితేను
అదె సన్న సేసుక నన్నంట వచ్చీని
పదర లే నైతిఁ గాక పక్కనఁ బువ్వులబంతి
నెదరొమ్ము వేసితేను యే మనీనె యపుడూ

(॥చేగ మీరి॥)
నెల వై పానుపుమీఁద ముసుఁగు వెట్టుకుంటే
కలయు మనే నంటాఁ గాఁగిలించీని
యెలమి శ్రీవెంకటేశుఁడింత నేరుపునఁ గూడె
బలి మైతే నాతోడఁ బంత మాడఁ గలండా

(||pallavi||)
sega mīrina panule sese vĕlla
bāgu mīram̐ dana kadi pai vachche dĕram̐gam̐ḍū

(||sega mīri||)
siggu vaḍi tanum̐ jūsi sirasu vaṁchugŏṁṭenu
daggari rammaṁṭi naṁṭā daṁḍa serīni
vĕggaḽiṁcha naidim̐ gāga vidaliṁchi vesi nenu
bagganam̐ diṭṭide tanabhāvamu sūsīnā

(||sega mīri||)
yĕduḍa nilavuga neniṁṭiloni kem̐gidenu
adĕ sanna sesuga nannaṁṭa vachchīni
padara le naidim̐ gāga pakkanam̐ buvvulabaṁti
nĕdarŏmmu vesidenu ye manīnĕ yabuḍū

(||sega mīri||)
nĕla vai pānubumīm̐da musum̐gu vĕṭṭuguṁṭe
kalayu mane naṁṭām̐ gām̐giliṁchīni
yĕlami śhrīvĕṁkaḍeśhum̐ḍiṁta nerubunam̐ gūḍĕ
bali maide nādoḍam̐ baṁta māḍam̐ galaṁḍā