Seesee vo jeevumdaa simtimchugo jeevumdaa

చీచీ వో జీవుఁడా చింతించుకో జీవుఁడా
Language

(॥పల్లవి॥)
చీచీ వో జీవుఁడా చింతించుకో జీవుఁడా
ఆచందాన కీచందము అరుహమా జీవుఁడా

(॥చీచీ॥)
వుత్తముఁడయిన హరి వుండేటి యాతుమలోన
తత్తరపుఁ గాంతలను తలపోసేదా
వొత్తి నారాయణనామ ముచ్చరించే నోరను
రుత్త యధరపుఁదోలు రుచిగొనేదా

(॥చీచీ॥)
పొందుగాఁ గోవిందునిఁ బూజించేటి చేతులను
సందడిఁ జన్నులమీఁద జాఁచబొయ్యేదా
కందువ దేవునిరూపు కనుఁగొనే చూపులు
ముందరి మర్మపుటంగములమీఁదఁ బెట్టేదా

(॥చీచీ॥)
వేవేలు విష్ణుకథలు వినియేటి చెవులను
ఆవటించి యాడసుద్దులాలకించేదా
శ్రీవేంకటేశ్వరుని సేవించే యీజీవనము
భావించక విషయాల పాలు సేసేదా

(||pallavi||)
sīsī vo jīvum̐ḍā siṁtiṁchugo jīvum̐ḍā
āsaṁdāna kīsaṁdamu aruhamā jīvum̐ḍā

(||sīsī||)
vuttamum̐ḍayina hari vuṁḍeḍi yādumalona
tattarabum̐ gāṁtalanu talabosedā
vŏtti nārāyaṇanāma muchchariṁche noranu
rutta yadharabum̐dolu rusigŏnedā

(||sīsī||)
pŏṁdugām̐ goviṁdunim̐ būjiṁcheḍi sedulanu
saṁdaḍim̐ jannulamīm̐da jām̐sabŏyyedā
kaṁduva devunirūbu kanum̐gŏne sūbulu
muṁdari marmabuḍaṁgamulamīm̐dam̐ bĕṭṭedā

(||sīsī||)
vevelu viṣhṇugathalu viniyeḍi sĕvulanu
āvaḍiṁchi yāḍasuddulālagiṁchedā
śhrīveṁkaḍeśhvaruni seviṁche yījīvanamu
bhāviṁchaga viṣhayāla pālu sesedā