Seeraliyyamgadavoyi sennageshavaa! soodu

చీరలియ్యఁగదవోయి చెన్నకేశవా! చూడు
Language

(॥పల్లవి॥)
చీరలియ్యఁగదవోయి చెన్నకేశవా! చూడు
చేరఁడేసి కన్నుల వో చెన్నకేశవా!

(॥చీర॥)
పొత్తుల మగఁడవై పోరచినవ్వు నవ్వేవు
చిత్తిడిగుణములే లో చెన్నకేశవా
చిత్తరు పతిమలమై సిగ్గు నీ కొప్పించితి! నీ
చిత్తము నా భాగ్యము చెన్నకేశవా

(॥చీర॥)
యెమ్మెలకు జవ్వనాన ఇంతగాఁగ నోమితిమి
చిమ్మవోయి నీకరుణ చెన్నకేశవా
కమ్మటి నవ్వేవు మాతో కడలేదు నీయాస
చిమ్ముఁ జెమటల వో చెన్నకేశవా

(॥చీర॥)
గరిమ నందరి నొక్కగాఁడిఁగట్టి కూడితివి
శిరసుపూవులు రాల చెన్నకేశవా
ఇరవై శ్రీ వేంకటాద్రి యిదియంటాఁగూడితివి
గొరబు చేఁతలఁ గండిగోట చెన్నకేశవా

(||pallavi||)
sīraliyyam̐gadavoyi sĕnnageśhavā! sūḍu
seram̐ḍesi kannula vo sĕnnageśhavā!

(||sīra||)
pŏttula magam̐ḍavai porasinavvu navvevu
sittiḍiguṇamule lo sĕnnageśhavā
sittaru padimalamai siggu nī kŏppiṁchidi! nī
sittamu nā bhāgyamu sĕnnageśhavā

(||sīra||)
yĕmmĕlagu javvanāna iṁtagām̐ga nomidimi
simmavoyi nīgaruṇa sĕnnageśhavā
kammaḍi navvevu mādo kaḍaledu nīyāsa
simmum̐ jĕmaḍala vo sĕnnageśhavā

(||sīra||)
garima naṁdari nŏkkagām̐ḍim̐gaṭṭi kūḍidivi
śhirasubūvulu rāla sĕnnageśhavā
iravai śhrī veṁkaḍādri yidiyaṁṭām̐gūḍidivi
gŏrabu sem̐talam̐ gaṁḍigoḍa sĕnnageśhavā