See see yimduge po siggayyee naagu

చీ చీ యిందుకే పో సిగ్గయ్యీ నాకు
Language

(॥పల్లవి॥)
చీ చీ యిందుకే పో సిగ్గయ్యీ నాకు
యేచి యంతరు మాలిన యీడు జోడు లేలరా

(॥చీచీ॥)
చెప్పిన ట్టెల్లా నేను సేసేఁ గాని యిందరితో
వొప్పగు వరుసవంతు లొల్లరా యింక
యెప్పుడు నీ దీవెనె యిదె నన్ను మన్నించుట
కప్పి వల పెల్ల నొక్కగాడిఁ గట్ట వద్దురా

(॥చీచీ॥)
అంది నీ యా నాజ్ఞలోన నణఁగి వుండేఁ గాని
సందడిలో కొలువులు చాలురా నాకు
ముందు నీవు నావాఁడవె మొక్కేఁ గాని గాజు దెచ్చి
చందపుమాణికముతో సరి సేయ రాకురా

(॥చీ చీ॥)
సరుస గూచుండేఁ గాని జంగిలి విడేలలోన
వొరిమెకుఁ జేయి చాఁచ నోపరా నేను
గరిమె శ్రీవెంకటేశ కాఁగిఁట గూడితి విట్టె
పరగఁ దెల్లని వెల్లాఁ బా లంటా నుండకురా

(||pallavi||)
sī sī yiṁduge po siggayyī nāgu
yesi yaṁtaru mālina yīḍu joḍu lelarā

(||sīsī||)
sĕppina ṭṭĕllā nenu sesem̐ gāni yiṁdarido
vŏppagu varusavaṁtu lŏllarā yiṁka
yĕppuḍu nī dīvĕnĕ yidĕ nannu manniṁchuḍa
kappi vala pĕlla nŏkkagāḍim̐ gaṭṭa vaddurā

(||sīsī||)
aṁdi nī yā nājñalona naṇam̐gi vuṁḍem̐ gāni
saṁdaḍilo kŏluvulu sālurā nāgu
muṁdu nīvu nāvām̐ḍavĕ mŏkkem̐ gāni gāju dĕchchi
saṁdabumāṇigamudo sari seya rāgurā

(||sī sī||)
sarusa gūsuṁḍem̐ gāni jaṁgili viḍelalona
vŏrimĕgum̐ jeyi sām̐sa nobarā nenu
garimĕ śhrīvĕṁkaḍeśha kām̐gim̐ṭa gūḍidi viṭṭĕ
paragam̐ dĕllani vĕllām̐ bā laṁṭā nuṁḍagurā