See see sadula manamga siggu gaadaa

చీ చీ సతుల మనఁగ సిగ్గు గాదా
Language

(॥పల్లవి॥)
చీ చీ సతుల మనఁగ సిగ్గు గాదా
తాచి యిన్నియు నింకఁ దడవ నేమిటికి

(॥చీ చీ॥)
సొలసియునుఁ దని వోదు చూచియునుఁ దని వోదు
పలుమారు నీమీఁదఁ బాడి తని వోదు
వలవ నేరుచు నాకె వలపించ నేర్చితివి
చెలులబతుకులు యింకఁ జెప్ప నేమిటికి

(॥చీ చీ॥)
కదిసియునుఁ దని వోదు కడు నవ్వి తని వోదు
అదన నీతో మాట లాడి తని వోదు
మది నిలిచె నీ కాపె మన్నించితివి నీవు
గుదికొన్న కామినుల గొడవ యేమిటికి

(॥చీ చీ॥)
మెచ్చియునుఁ దని వోదు మితిమీరి తని వోదు
కొచ్చి కాఁగిటిరతుల గూడి తని వోదు
యెచ్చటను శ్రీవెంకటేశ ననుఁ గూడితివి
హెచ్చితి మిద్దర మొకటే యితరు లేమిటికి

(||pallavi||)
sī sī sadula manam̐ga siggu gādā
tāsi yinniyu niṁkam̐ daḍava nemiḍigi

(||sī sī||)
sŏlasiyunum̐ dani vodu sūsiyunum̐ dani vodu
palumāru nīmīm̐dam̐ bāḍi tani vodu
valava nerusu nāgĕ valabiṁcha nersidivi
sĕlulabadugulu yiṁkam̐ jĕppa nemiḍigi

(||sī sī||)
kadisiyunum̐ dani vodu kaḍu navvi tani vodu
adana nīdo māḍa lāḍi tani vodu
madi nilisĕ nī kābĕ manniṁchidivi nīvu
gudigŏnna kāminula gŏḍava yemiḍigi

(||sī sī||)
mĕchchiyunum̐ dani vodu midimīri tani vodu
kŏchchi kām̐giḍiradula gūḍi tani vodu
yĕchchaḍanu śhrīvĕṁkaḍeśha nanum̐ gūḍidivi
hĕchchidi middara mŏgaḍe yidaru lemiḍigi