See see narula demti jeevanamu

చీ చీ నరుల దేఁటి జీవనము
Language

(॥పల్లవి॥)
చీ చీ నరుల దేఁటి జీవనము
కాచుకొని హరి నీవే కరుణింతు గాకా

(॥చీచీ॥)
అడవిలో మృగజాతియైనాఁ గావచ్చుఁ గాక
వడి నితరులఁ గొలువఁగ వచ్చునా
వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక
విడువ కెవ్వరినైనా వెఁడవచ్చునా

(॥చీచీ॥)
పసరమై వెతలేని పాటువడవచ్చు గాక
కసటు వొనరులఁ బొగడవచ్చునా
వుసురు మానై పుట్టివుండనైనావచ్చుఁ గాక
దెసల నెక్కడనైనాఁ దిరుగవచ్చునా

(॥చీచీ॥)
యెమ్మెల పుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁ గాక
కమ్మి హరి దాసుఁడు గావచ్చునా
నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమె కాని
దొమ్ముల కర్మము లివి తోయవచ్చునా

(||pallavi||)
sī sī narula dem̐ṭi jīvanamu
kāsugŏni hari nīve karuṇiṁtu gāgā

(||sīsī||)
aḍavilo mṛgajādiyainām̐ gāvachchum̐ gāga
vaḍi nidarulam̐ gŏluvam̐ga vachchunā
vuḍivoni pakṣhiyai vuṁḍanainā vachchum̐ gāga
viḍuva kĕvvarinainā vĕm̐ḍavachchunā

(||sīsī||)
pasaramai vĕdaleni pāḍuvaḍavachchu gāga
kasaḍu vŏnarulam̐ bŏgaḍavachchunā
vusuru mānai puṭṭivuṁḍanaināvachchum̐ gāga
dĕsala nĕkkaḍanainām̐ dirugavachchunā

(||sīsī||)
yĕmmĕla puṇyālu sesi yila nelavachchum̐ gāga
kammi hari dāsum̐ḍu gāvachchunā
nĕmmadi śhrī veṁkaḍeśha nī sittamĕ kāni
dŏmmula karmamu livi toyavachchunā