Sedum gaaga voodigelu seppinattellaa

సేతుఁ గాక వూడిగేలు చెప్పినట్టెల్లా
Language

(॥పల్లవి॥)
సేతుఁ గాక వూడిగేలు చెప్పినట్టెల్లా
చేతికి లోనైనదాన సిగ్గువడనున్నదా

(॥॥)
మలసి మలసి యెన్నిమాటలు నీవాడినాను
చలములు నీతోను సాదించేనా
బలిమిసేసి నీవు పంతములు చూపితేను
వలచినదాన నాకు వాసులున్నవా

(॥॥)
యెనసి యెవ్వరి నీవు యెదురులు వెట్టినాను
కొనచూపులనుఁ జూచి కోపగించేనా
పెనఁగి నీవెంతేసి తబ్బిబ్బుగా నడచినాను
ననిచినదాన నాకు నాలి వున్నదా

(॥॥)
కొంకక నీమేన నెన్ని గురుతులు నించుకొన్నా
నంకెకు లోనౌదుఁ గాక యలిగేనా
కంకిగా శ్రీవేంకటేశ కలసితి వెట్టుండినా
లంకైనదానను వేరే లాగులుండీనా

(||pallavi||)
sedum̐ gāga vūḍigelu sĕppinaṭṭĕllā
sedigi lonainadāna sigguvaḍanunnadā

(||||)
malasi malasi yĕnnimāḍalu nīvāḍinānu
salamulu nīdonu sādiṁchenā
balimisesi nīvu paṁtamulu sūbidenu
valasinadāna nāgu vāsulunnavā

(||||)
yĕnasi yĕvvari nīvu yĕdurulu vĕṭṭinānu
kŏnasūbulanum̐ jūsi kobagiṁchenā
pĕnam̐gi nīvĕṁtesi tabbibbugā naḍasinānu
nanisinadāna nāgu nāli vunnadā

(||||)
kŏṁkaga nīmena nĕnni gurudulu niṁchugŏnnā
naṁkĕgu lonaudum̐ gāga yaligenā
kaṁkigā śhrīveṁkaḍeśha kalasidi vĕṭṭuṁḍinā
laṁkainadānanu vere lāguluṁḍīnā