Sedulu saamsidimi seyetti mokkidimi

చేతులు చాఁచితిమి చేయెత్తి మొక్కితిమి
Language

(॥పల్లవి॥)
చేతులు చాఁచితిమి చేయెత్తి మొక్కితిమి
బూతుల తిట్లు వచ్చీ పోవయ్య యిఁకను

(॥చేతు॥)
మరిగి నాతో నీవు మాటలాడుతా నంతలో
పొరుగవారిమాటలు పోర చాయనా
పరగ నే నేమనినా పాపముఁ గోపముఁ బొత్తుఁ
దొరలతో మాట లేల తొలవయ్య ఇఁకను

(॥చేతు॥)
యీడ నాతో నవ్వు నవ్వి యిప్పుడె యాడకుఁ బోయి
వాడికనవ్వు నవ్వఁగ వడదేరెనా
జాడతోడ నుండకున్న సరసాలే విరసాలు
వేడుకకాఁడ వైతివి విడవయ్య ఇఁకను

(॥చేతు॥)
ననుపు నాతోఁ జేసి నంటు సేసితి వాపెతో
తనివి నీ కందువంక తలకూడెనా
ననుఁ గూడితి వప్పటి నమ్మించి శ్రీవేంకటేశ
అనుఁగుజాణఁడవు నిన్ననమయ్య ఇఁకను

(||pallavi||)
sedulu sām̐sidimi seyĕtti mŏkkidimi
būdula tiṭlu vachchī povayya yim̐kanu

(||sedu||)
marigi nādo nīvu māḍalāḍudā naṁtalo
pŏrugavārimāḍalu pora sāyanā
paraga ne nemaninā pābamum̐ gobamum̐ bŏttum̐
dŏralado māḍa lela tŏlavayya im̐kanu

(||sedu||)
yīḍa nādo navvu navvi yippuḍĕ yāḍagum̐ boyi
vāḍiganavvu navvam̐ga vaḍaderĕnā
jāḍadoḍa nuṁḍagunna sarasāle virasālu
veḍugagām̐ḍa vaidivi viḍavayya im̐kanu

(||sedu||)
nanubu nādom̐ jesi naṁṭu sesidi vābĕdo
tanivi nī kaṁduvaṁka talagūḍĕnā
nanum̐ gūḍidi vappaḍi nammiṁchi śhrīveṁkaḍeśha
anum̐gujāṇam̐ḍavu ninnanamayya im̐kanu