Sedulu paim jaamsavayya sekkulatte nokkavayya

చేతులు పైఁ జాఁచవయ్య చెక్కులట్టె నొక్కవయ్య
Language

(॥పల్లవి॥)
చేతులు పైఁ జాఁచవయ్య చెక్కులట్టె నొక్కవయ్య
యీతల మీవంటి గుట్టు లిఁక నేఁటికి

(॥చేతు॥)
బొమ్మముడిజం కేనల పొలఁతి నీమోము చూచి
కుమ్మరించీ వలపులు కూడఁ గూడను
రమ్మని పిలువలేక రాజసము మానలెక
వుమ్మగిలీఁ జెమటలే వూరవూరను

(॥చేతు॥)
జాఱినపయ్యదతోడ సళుపుటాసలు నీపై
తూఱఁజేసె నవ్వుతానె తోడఁదోడను
మీఱినసిగ్గులఁ గొంత మించి నిట్టూర్పులఁ గొంత
ఆఱడాయఁ దమకాన నంతనంతను

(॥చేతు॥)
సరసపుమాటలతో చాయల సన్నలతోడ
సరుస మోవి నీ కిచ్చె సారె సారెకు
యిరవై శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
కరఁగీ మెచ్చులు మెచ్చి కాలఁగాలమునను

(||pallavi||)
sedulu paim̐ jām̐savayya sĕkkulaṭṭĕ nŏkkavayya
yīdala mīvaṁṭi guṭṭu lim̐ka nem̐ṭigi

(||sedu||)
bŏmmamuḍijaṁ kenala pŏlam̐ti nīmomu sūsi
kummariṁchī valabulu kūḍam̐ gūḍanu
rammani piluvalega rājasamu mānalĕga
vummagilīm̐ jĕmaḍale vūravūranu

(||sedu||)
jāṟinabayyadadoḍa saḽubuḍāsalu nībai
tūṟam̐jesĕ navvudānĕ toḍam̐doḍanu
mīṟinasiggulam̐ gŏṁta miṁchi niṭṭūrbulam̐ gŏṁta
āṟaḍāyam̐ damagāna naṁtanaṁtanu

(||sedu||)
sarasabumāḍalado sāyala sannaladoḍa
sarusa movi nī kichchĕ sārĕ sārĕgu
yiravai śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
karam̐gī mĕchchulu mĕchchi kālam̐gālamunanu