Seduletti mokkaro jeevagotlaala yide

చేతులెత్తి మొక్కరో జీవకోట్లాల యిదె
Language

(॥పల్లవి॥)
చేతులెత్తి మొక్కరో జీవకోట్లాల యిదె
యీతలాతల నిండిరిదె నారదాదులు

(॥చేతు॥)
దిక్కులు సాధించ హరి తిరుతే రెక్కఁగాను
యిక్కడ రతికెక్కిరి యింద్రాదులు
వెక్కసపు శార్జము వెస చేతఁ బట్టఁ గాను
పక్కున గుండె వట్టిరి బ్రహ్మాదులు

(॥చేతు॥)
యెడమచేత శంఖ మెత్తినప్పుడు వేదము
కడఁగి మొదలెత్తిరి గౌతమాదులు
కుడిచేతి చక్రము గక్కున మెఱిపంచఁగాను
సుడిసియు మెఱసేరు సూర్యచంద్రాదులు

(॥చేతు॥)
లలి శ్రీ వేంకటేశుఁ డలమేలుమంగయుఁ బెండ్లి
నలరఁగ నమరిరి అమరాదులు
వెలయ నితఁ డింతట విశ్వరూపము చూపఁగ
సలిగఁ బొడచూపిరి సనకాదులు

(||pallavi||)
sedulĕtti mŏkkaro jīvagoṭlāla yidĕ
yīdalādala niṁḍiridĕ nāradādulu

(||sedu||)
dikkulu sādhiṁcha hari tirude rĕkkam̐gānu
yikkaḍa radigĕkkiri yiṁdrādulu
vĕkkasabu śhārjamu vĕsa sedam̐ baṭṭam̐ gānu
pakkuna guṁḍĕ vaṭṭiri brahmādulu

(||sedu||)
yĕḍamaseda śhaṁkha mĕttinappuḍu vedamu
kaḍam̐gi mŏdalĕttiri gaudamādulu
kuḍisedi sakramu gakkuna mĕṟibaṁcham̐gānu
suḍisiyu mĕṟaseru sūryasaṁdrādulu

(||sedu||)
lali śhrī veṁkaḍeśhum̐ ḍalamelumaṁgayum̐ bĕṁḍli
nalaram̐ga namariri amarādulu
vĕlaya nidam̐ ḍiṁtaḍa viśhvarūbamu sūbam̐ga
saligam̐ bŏḍasūbiri sanagādulu