Seduletti mokkaramma seri yaaradettaramma

చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ
Language

(॥పల్లవి॥)
చేతులెత్తి మొక్కరమ్మ చేరి యారతెత్తరమ్మ
యేతులే బూమెల్లా నిండె నీదేవదేవునికి

(॥చేతు॥)
తతికొని పన్నీటధారలు పై నించినించి
సతముగాఁ బెద్దలు మజ్జనమార్చఁగా
అతివలచనుఁగొండ లంగము లొత్తినందుకు
యితవులై తోఁచేనేఁడు యిందిరాపతికి

(॥చేతు॥)
కప్పురపుధూళి మేనఁ గలయఁగ గంపెఁడేసి
నెప్పున సందుసందుల నిగిడించఁగా
చొప్పులెత్తి గొల్లెతలచూపులు దాఁకినకుమ్మె-
లప్పు డన్నియునుఁ గప్పె నందువల్ల హరికి

(॥చేతు॥)
తట్టుపుణుఁ గలది యందపుటలమేలుమంగ-
నట్టే వురముమీఁద నమరించఁగా
నెట్టనఁ బచ్చిసేసిననెలతఁలచేఁతలలో
చిట్టకములెల్లాఁ గప్పె శ్రీవేంకటపతికి

(||pallavi||)
sedulĕtti mŏkkaramma seri yāradĕttaramma
yedule būmĕllā niṁḍĕ nīdevadevunigi

(||sedu||)
tadigŏni pannīḍadhāralu pai niṁchiniṁchi
sadamugām̐ bĕddalu majjanamārsam̐gā
adivalasanum̐gŏṁḍa laṁgamu lŏttinaṁdugu
yidavulai tom̐senem̐ḍu yiṁdirābadigi

(||sedu||)
kappurabudhūḽi menam̐ galayam̐ga gaṁpĕm̐ḍesi
nĕppuna saṁdusaṁdula nigiḍiṁcham̐gā
sŏppulĕtti gŏllĕdalasūbulu dām̐kinagummĕ-
lappu ḍanniyunum̐ gappĕ naṁduvalla harigi

(||sedu||)
taṭṭubuṇum̐ galadi yaṁdabuḍalamelumaṁga-
naṭṭe vuramumīm̐da namariṁcham̐gā
nĕṭṭanam̐ bachchisesinanĕladam̐lasem̐talalo
siṭṭagamulĕllām̐ gappĕ śhrīveṁkaḍabadigi