Sedu letti mokkaramma seri yaara tettaramma

చేతు లెత్తి మొక్కరమ్మ చేరి యార తెత్తరమ్మ
Language

(॥పల్లవి॥)
చేతు లెత్తి మొక్కరమ్మ చేరి యార తెత్తరమ్మ
యేతులే బూమెల్లా నిండె నీ దేవదేవునికి

(॥చేతు॥)
తతిగొని పన్నీటిధారలు పై నించి నించి
సతముగాఁ బెద్దలు మజ్జన మార్చఁగా
అతివలచనుఁగొండ లంగము లొత్తినందుకు
యితవులై తోఁచె నేఁడు యిందిరాపతికి

(॥చేతు॥)
కప్పురపుధూళి మేనఁ గలయఁగ గంపెఁడేసి
నెప్పన సందుసందుల నిగిడించఁగా
చొప్పులెత్తి గొల్లెతల చూపులు దాఁకినీ కుమ్మె
లప్పు డన్నియునుఁ గప్పినందువల్ల హరికి

(॥చేతు॥)
తట్టుపుణుఁ గలఁది యందపు టలమేలుమంగ
నట్టే వురమువీూఁద నమరించఁగా
నెట్టనఁ బచ్చిసేనెలఁతల చేఁతలలో
చిట్టకము లెల్లాఁగప్పె శ్రీవేంకటపతికి

(||pallavi||)
sedu lĕtti mŏkkaramma seri yāra tĕttaramma
yedule būmĕllā niṁḍĕ nī devadevunigi

(||sedu||)
tadigŏni pannīḍidhāralu pai niṁchi niṁchi
sadamugām̐ bĕddalu majjana mārsam̐gā
adivalasanum̐gŏṁḍa laṁgamu lŏttinaṁdugu
yidavulai tom̐sĕ nem̐ḍu yiṁdirābadigi

(||sedu||)
kappurabudhūḽi menam̐ galayam̐ga gaṁpĕm̐ḍesi
nĕppana saṁdusaṁdula nigiḍiṁcham̐gā
sŏppulĕtti gŏllĕdala sūbulu dām̐kinī kummĕ
lappu ḍanniyunum̐ gappinaṁduvalla harigi

(||sedu||)
taṭṭubuṇum̐ galam̐di yaṁdabu ṭalamelumaṁga
naṭṭe vuramuvīూm̐da namariṁcham̐gā
nĕṭṭanam̐ bachchisenĕlam̐tala sem̐talalo
siṭṭagamu lĕllām̐gappĕ śhrīveṁkaḍabadigi