Sedigim gomta seraneeve

చేతికిఁ గొంత చేరనీవే
Language

(॥పల్లవి॥)
చేతికిఁ గొంత చేరనీవే
ఘాతలఁ దన మేను కరఁగించేఁ గాని

(॥॥)
రానీవే వాని రవ్వసేయక
ఆనిపట్టి నేనే అడిగేను
పూని తొలుతనంటే బొంకినీ
నానినకాఁగిట న్వవించేఁగాని

(॥॥)
తిరుగనీవే వానిఁ దెగనాడక
మరిగించే నేనే మాఁటలను
తరవాత నేమనినాఁ దలవంచీని
మరుతంత్రములన్నీ మరి నేసేఁగాని

(॥॥)
వుండనీవే వానినొకటాడక
అండనే రతికేలి నలయించేను
దండి శ్రీవేంకటదైవ మీతఁడే
నిండి వురముమీఁదనే మొక్కఁగాని

(||pallavi||)
sedigim̐ gŏṁta seranīve
ghādalam̐ dana menu karam̐giṁchem̐ gāni

(||||)
rānīve vāni ravvaseyaga
ānibaṭṭi nene aḍigenu
pūni tŏludanaṁṭe bŏṁkinī
nāninagām̐giḍa nvaviṁchem̐gāni

(||||)
tiruganīve vānim̐ dĕganāḍaga
marigiṁche nene mām̐ṭalanu
taravāda nemaninām̐ dalavaṁchīni
marudaṁtramulannī mari nesem̐gāni

(||||)
vuṁḍanīve vāninŏgaḍāḍaga
aṁḍane radigeli nalayiṁchenu
daṁḍi śhrīveṁkaḍadaiva mīdam̐ḍe
niṁḍi vuramumīm̐dane mŏkkam̐gāni