చేతికి నీవు లోఁ గాఁగ జెప్పేఁ గాని
(॥పల్లవి॥)
చేతికి నీవు లోఁ గాఁగ జెప్పేఁ గాని
యేతులఁ గుచ్చితా లుండె యిందాఁక నాకును
(॥చేతికి॥)
మంతన మాడితిని మగువతో నీ వప్పుడు
పంతము లాడితెనే నీ పడఁతితోడ
యింతలో నీవు రాఁగానె యేకచిత్త మాయఁ గాని
దొంతర చలము లెక్కె తోడఁదోడ నాకును
(॥చేతికి॥)
చేతులు చాఁచితివ చెలియపై నీ వప్పుడు
కాతరాలు రేఁచితి నా కాయములోన
యీతలఁ జెక్కు నొక్కఁగా యియ్యకొంటి నేనన్నియు
వాతులు మోవఁగఁ బొంగె వాసు లెల్ల నాకును
(॥చేతికి॥)
కన్నులచె మొక్కితివి కాంతకు నీ వల్లప్పుడు
సన్నలఁ దిట్టితి నిన్ను సారెకు నేను
అన్నిటా శ్రీవెంటకేశ అలమఁగ మెచ్చేఁగాని
నున్ననిచెమట నిండె నొసలనె నాకునూ
(||pallavi||)
sedigi nīvu lom̐ gām̐ga jĕppem̐ gāni
yedulam̐ guchchidā luṁḍĕ yiṁdām̐ka nāgunu
(||sedigi||)
maṁtana māḍidini maguvado nī vappuḍu
paṁtamu lāḍidĕne nī paḍam̐tidoḍa
yiṁtalo nīvu rām̐gānĕ yegasitta māyam̐ gāni
dŏṁtara salamu lĕkkĕ toḍam̐doḍa nāgunu
(||sedigi||)
sedulu sām̐sidiva sĕliyabai nī vappuḍu
kādarālu rem̐sidi nā kāyamulona
yīdalam̐ jĕkku nŏkkam̐gā yiyyagŏṁṭi nenanniyu
vādulu movam̐gam̐ bŏṁgĕ vāsu lĕlla nāgunu
(||sedigi||)
kannulasĕ mŏkkidivi kāṁtagu nī vallappuḍu
sannalam̐ diṭṭidi ninnu sārĕgu nenu
anniḍā śhrīvĕṁṭageśha alamam̐ga mĕchchem̐gāni
nunnanisĕmaḍa niṁḍĕ nŏsalanĕ nāgunū