Sedigi lonainappude seri kaigomduvugaaga

చేతికి లోనైనప్పుడే చేరి కైకొందువుగాక
Language

(॥పల్లవి॥)
చేతికి లోనైనప్పుడే చేరి కైకొందువుగాక
పోతరపు మదమునఁ బొద్దేల జరపేవె

(॥చేతి॥)
పిలువగబిలువగ బిగిసే వాతనితోను
చలపాదితనమేలే సారెసారెకు
నలువున నీవలపు నాటి మతి నుండగాను
వెలి నీవు సటచేసి విఱ్ఱవీగేదేటిదే

(॥చేతి॥)
పట్టబట్ట నాతనితో బలిమినే పెనగేవు
వట్టిబీరములేటికే వరవాతాను
వుట్టిపడి నీయాసలు వొడినిండా నుండగాను
దిట్టతనములు చూపేదీమస మదేటిదే

(॥చేతి॥)
కూడగగూడగ గునిసే వాతనితోను
పాడిపంతము లేటికే పచ్చిదేరెను
యీడనె శ్రీవేంకటేశు డెనసె ని న్నింతలోనె
వీడెపు సొక్కులతో డివింత లిదేటిదే

(||pallavi||)
sedigi lonainappuḍe seri kaigŏṁduvugāga
podarabu madamunam̐ bŏddela jarabevĕ

(||sedi||)
piluvagabiluvaga bigise vādanidonu
salabādidanamele sārĕsārĕgu
naluvuna nīvalabu nāḍi madi nuṁḍagānu
vĕli nīvu saḍasesi viṭravīgedeḍide

(||sedi||)
paṭṭabaṭṭa nādanido balimine pĕnagevu
vaṭṭibīramuleḍige varavādānu
vuṭṭibaḍi nīyāsalu vŏḍiniṁḍā nuṁḍagānu
diṭṭadanamulu sūbedīmasa madeḍide

(||sedi||)
kūḍagagūḍaga gunise vādanidonu
pāḍibaṁtamu leḍige pachchiderĕnu
yīḍanĕ śhrīveṁkaḍeśhu ḍĕnasĕ ni nniṁtalonĕ
vīḍĕbu sŏkkulado ḍiviṁta lideḍide