చేతికి లోనైన పతిఁ జేకొందుఁ గాక
(॥పల్లవి॥)
చేతికి లోనైన పతిఁ జేకొందుఁ గాక
ఆతలివారి మాటల కానవెట్ట నేలే
(॥॥)
అంది మాటాడకతొల్లె అవుఁగాములు చెల్లుఁగాక
అందముగాఁగూడి విడనాడఁగనేలే
పందెములాడకతొల్లే బలుములు చెల్లుఁగాక
నిందమోపి యాతనినే నేరమెంచనేలే
(॥॥)
చేయిమోపకతొలుతే సిగ్గువడఁ జెల్లుఁగాక
కాయము లంటినమీఁదఁ గడమలేలే
రాయడి దవ్వులనుండే రాజసాలు చెల్లుఁగాక
యీయెడ మోమోము చూచి యెడమాఁటలేలే
(॥॥)
కొత్తవలపుల కెల్ల గురుతులు చెల్లుఁగాక
హత్తి ననుపైనమీఁద నాసుద్దులేలే
యెత్తుక శ్రీ వేంకటేశుఁ డింతచేసి నిన్నుఁ గూడె
పొత్తుగూడినమీఁదట బొరపొచ్చమేలే
(||pallavi||)
sedigi lonaina padim̐ jegŏṁdum̐ gāga
ādalivāri māḍala kānavĕṭṭa nele
(||||)
aṁdi māḍāḍagadŏllĕ avum̐gāmulu sĕllum̐gāga
aṁdamugām̐gūḍi viḍanāḍam̐ganele
paṁdĕmulāḍagadŏlle balumulu sĕllum̐gāga
niṁdamobi yādanine neramĕṁchanele
(||||)
seyimobagadŏlude sigguvaḍam̐ jĕllum̐gāga
kāyamu laṁṭinamīm̐dam̐ gaḍamalele
rāyaḍi davvulanuṁḍe rājasālu sĕllum̐gāga
yīyĕḍa momomu sūsi yĕḍamām̐ṭalele
(||||)
kŏttavalabula kĕlla gurudulu sĕllum̐gāga
hatti nanubainamīm̐da nāsuddulele
yĕttuga śhrī veṁkaḍeśhum̐ ḍiṁtasesi ninnum̐ gūḍĕ
pŏttugūḍinamīm̐daḍa bŏrabŏchchamele