Sedigi lonaide neevu seyagumduvaa

చేతికి లోనైతే నీవు సేయకుందువా
Language

(॥పల్లవి॥)
చేతికి లోనైతే నీవు సేయకుందువా
నీ తెరువు వచ్చేవారి నేర మింతేకాక

(॥॥)
మగువలు విన్నవించేమాటలు వినకతొల్లె
తగవులు చెప్పేవు తలవిళ్ళనె
యెగసక్కీఁడ విన్నిటా నేమిచేప్పేదిటు నిన్ను
తగిలేటివారియెడ్డతన మింతికాక

(॥॥)
పడఁతుల వూడిగాలు పచ్చిదేరకతొల్లె
వుడుగర లిచ్చేవు వూరకైనాను
గడుసు కాఁడవు నిన్నుఁ గాదనేవారెవ్వరు
బడిఁ దిరిగేటి వారిభాగ్య మింతేకాక

(॥॥)
చెలుల మేపులతేనె చేరికొనకతొల్లె
కలసేపు కాఁగిళ్ళ కందువలనే
యిల శ్రీ వేంకటేశుఁడ వెదురాడేవారెవ్వరు
వలచినమావంటివారితమి గాక

(||pallavi||)
sedigi lonaide nīvu seyaguṁduvā
nī tĕruvu vachchevāri nera miṁtegāga

(||||)
maguvalu vinnaviṁchemāḍalu vinagadŏllĕ
tagavulu sĕppevu talaviḽḽanĕ
yĕgasakkīm̐ḍa vinniḍā nemiseppediḍu ninnu
tagileḍivāriyĕḍḍadana miṁtigāga

(||||)
paḍam̐tula vūḍigālu pachchideragadŏllĕ
vuḍugara lichchevu vūragainānu
gaḍusu kām̐ḍavu ninnum̐ gādanevārĕvvaru
baḍim̐ dirigeḍi vāribhāgya miṁtegāga

(||||)
sĕlula mebuladenĕ serigŏnagadŏllĕ
kalasebu kām̐giḽḽa kaṁduvalane
yila śhrī veṁkaḍeśhum̐ḍa vĕdurāḍevārĕvvaru
valasinamāvaṁṭivāridami gāga