చేతికి లోనై యుండఁగాఁ జెప్పించుకొనేనా నేను
(॥పల్లవి॥)
చేతికి లోనై యుండఁగాఁ జెప్పించుకొనేనా నేను
ఆతలి వేడుకలెల్ల నంగమే యెరుఁగును
(॥చేతి॥)
పాటించి నీవు పెక్కుపనులు గలవాఁడవు
మాటలై నా నాడితిగా మంచిదాయను
ఆఁటదాని కీపాటియాస గలిగినఁ జాలు
తాటించి యామీఁదిపని తానే నేరేచును
(॥చేతి॥)
సరస గుట్టుతో రాజసమున నున్న వాఁడవు
సరస మాడితివిగా సమ్మతాయను
తరుణుల కీపాటిదాయిదటైనఁ జాలు
గరిమె లన్నియుఁ దొల్లె కై వశ మైనవి
(॥చేతి॥)
యేఁగి వచ్చి పెక్కురతు లెరిఁగినట్టివాఁడవు
కాఁగిటఁ గూడితివిగా గట్టి యాయను
మాఁగినశ్రీవేంకటేశ మావంటి వారికెల్ల
పాఁగినయీమన్ననలు పదివేల కెక్కెను
(||pallavi||)
sedigi lonai yuṁḍam̐gām̐ jĕppiṁchugŏnenā nenu
ādali veḍugalĕlla naṁgame yĕrum̐gunu
(||sedi||)
pāḍiṁchi nīvu pĕkkubanulu galavām̐ḍavu
māḍalai nā nāḍidigā maṁchidāyanu
ām̐ṭadāni kībāḍiyāsa galiginam̐ jālu
tāḍiṁchi yāmīm̐dibani tāne neresunu
(||sedi||)
sarasa guṭṭudo rājasamuna nunna vām̐ḍavu
sarasa māḍidivigā sammadāyanu
taruṇula kībāḍidāyidaḍainam̐ jālu
garimĕ lanniyum̐ dŏllĕ kai vaśha mainavi
(||sedi||)
yem̐gi vachchi pĕkkuradu lĕrim̐ginaṭṭivām̐ḍavu
kām̐giḍam̐ gūḍidivigā gaṭṭi yāyanu
mām̐ginaśhrīveṁkaḍeśha māvaṁṭi vārigĕlla
pām̐ginayīmannanalu padivela kĕkkĕnu