Sedigi lonaayam badim jegonavamma

చేతికి లోనాయఁ బతిఁ జేకొనవమ్మ
Language

(॥పల్లవి॥)
చేతికి లోనాయఁ బతిఁ జేకొనవమ్మ
నీతులెల్లఁ గంటిమిదె నీవంకనే యమ్మ

(॥చేతి॥)
మొగము నీవు చూడఁగ మోహము రెట్టించె నేఁడు
నగవమ్మా ఇప్పుడిట్టె నాయకునితో
నిగిడి కూటములకు నీయంతనే పోఁగువెళ్లె
వగదీరె నాతనిని వలపించవమ్మా

(॥చేతి॥)
ముచ్చట నీవాడఁగాను ముమ్మడించె నిదె మేలు
ఇచ్చకమాడవమ్మ ప్రాణెశునితోను
నిచ్చలపుఁ గందువలు నీవద్దనే వున్నవి
రిచ్చగా నాతనితమి రేఁచఁగదవమ్మా

(॥చేతి॥)
వెలసె నీవు మెచ్చఁగ వేవేలాయ రతులు
కలయవమ్మ శ్రీవేంకటపతిని
కలికితనము లివి కాణాచిగా నీకుఁ జిక్కె
పొలసి యీతనినిట్టె భోగించవమ్మా

(||pallavi||)
sedigi lonāyam̐ badim̐ jegŏnavamma
nīdulĕllam̐ gaṁṭimidĕ nīvaṁkane yamma

(||sedi||)
mŏgamu nīvu sūḍam̐ga mohamu rĕṭṭiṁchĕ nem̐ḍu
nagavammā ippuḍiṭṭĕ nāyagunido
nigiḍi kūḍamulagu nīyaṁtane pom̐guvĕḽlĕ
vagadīrĕ nādanini valabiṁchavammā

(||sedi||)
muchchaḍa nīvāḍam̐gānu mummaḍiṁchĕ nidĕ melu
ichchagamāḍavamma prāṇĕśhunidonu
nichchalabum̐ gaṁduvalu nīvaddane vunnavi
richchagā nādanidami rem̐sam̐gadavammā

(||sedi||)
vĕlasĕ nīvu mĕchcham̐ga vevelāya radulu
kalayavamma śhrīveṁkaḍabadini
kaligidanamu livi kāṇāsigā nīgum̐ jikkĕ
pŏlasi yīdaniniṭṭĕ bhogiṁchavammā