చేతికి లో నైనవారిఁ జేతురా పగవా రైన
(॥పల్లవి॥)
చేతికి లో నైనవారిఁ జేతురా పగవా రైన
కాతరాన నీవే కలవళించితివి
(॥చేతికి॥)
యెట్టకేలకును నిన్ను యింటికిఁ బిలచుకొంటి
చుట్టమ నయినదాన సూడు వట్టేనా
యిట్టె నీ కెవ్వతె చెప్పే యింతసేతుఁ జేయ నని
నెట్టన నాగుణ మెల్ల నీ వెరఁగవా
(॥చేతికి॥)
చెక్కు నొక్కి చేత మొక్కి సేవ లిన్నియునుఁ జేసె
మొక్కలాన నింక నిన్ను మోస వుచ్చేనా
యెక్కడిబుద్ది దలఁచి తేల సిగ్గు వడ నీకు
యిక్కువ నీ వా సంది యిటువంటిదా
(॥చేతికి॥)
మాఁగినమోమి యిచ్చి మంతానలు నీతో నాడి
కాఁగిట నిన్నుఁ గూడి ఘాత సేసేనా
యేఁగివచ్చి శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
నాఁగువారె వలపులు నమ్మి కియ్య వలెనా
(||pallavi||)
sedigi lo nainavārim̐ jedurā pagavā raina
kādarāna nīve kalavaḽiṁchidivi
(||sedigi||)
yĕṭṭagelagunu ninnu yiṁṭigim̐ bilasugŏṁṭi
suṭṭama nayinadāna sūḍu vaṭṭenā
yiṭṭĕ nī kĕvvadĕ sĕppe yiṁtasedum̐ jeya nani
nĕṭṭana nāguṇa mĕlla nī vĕram̐gavā
(||sedigi||)
sĕkku nŏkki seda mŏkki seva linniyunum̐ jesĕ
mŏkkalāna niṁka ninnu mosa vuchchenā
yĕkkaḍibuddi dalam̐si tela siggu vaḍa nīgu
yikkuva nī vā saṁdi yiḍuvaṁṭidā
(||sedigi||)
mām̐ginamomi yichchi maṁtānalu nīdo nāḍi
kām̐giḍa ninnum̐ gūḍi ghāda sesenā
yem̐givachchi śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
nām̐guvārĕ valabulu nammi kiyya valĕnā