చెదఱక వెలుఁగే చేను మేయఁగఁ జొచ్చె
(॥పల్లవి॥)
చెదఱక వెలుఁగే చేను మేయఁగఁ జొచ్చె
అదలించి తగదు నీ కనువారు వేరీ
(॥చెద॥)
చిత్త మింద్రియములచేఁ జిక్కి, కడు మద-
మెత్తిన వద్దన నిఁక వేరీ
హత్తినమనసు మోహాదులతోఁ గూడి
తత్తరించిన మాన్పఁదగువారు వేరీ
(॥చెద॥)
జీవుఁడిన్నిటికిఁ దాఁ జిక్కి పోయినత్రోవఁ
బోవఁజొచ్చిన బుద్ధిపొల మేది
శ్రీవేంకటేశుని చింతాపరతఁ గాని
కావఁగ నాత్మకు గతి దానేది
(||pallavi||)
sĕdaṟaga vĕlum̐ge senu meyam̐gam̐ jŏchchĕ
adaliṁchi tagadu nī kanuvāru verī
(||sĕda||)
sitta miṁdriyamulasem̐ jikki, kaḍu mada-
mĕttina vaddana nim̐ka verī
hattinamanasu mohāduladom̐ gūḍi
tattariṁchina mānpam̐daguvāru verī
(||sĕda||)
jīvum̐ḍinniḍigim̐ dām̐ jikki poyinatrovam̐
bovam̐jŏchchina buddhibŏla medi
śhrīveṁkaḍeśhuni siṁtābaradam̐ gāni
kāvam̐ga nātmagu gadi dānedi