Sedanainabaadi seva seyamgaladaana nimte

చేతనైనపాటి సేవ సేయఁగలదాన నింతే
Language

(॥పల్లవి॥)
చేతనైనపాటి సేవ సేయఁగలదాన నింతే
ఆతల నీ చిత్తమెట్టో అది నే నెఱఁగను

(॥చేత॥)
నిద్దిరించేవో కొంత నీ కన్ను లెఱ్ఱనున్నవి
వొద్దనే మంచమూ నదె వోవరీ నదె
తిద్దుకొనేవో కస్తూరి తిరుమణి చెదరెను
అద్దమిదె మొకమదె అవ్వల యెఱఁగను

(॥చేత॥)
జలకమాడేవో నీవు సారె మేను చెమరించె
కొల నదె తడియొత్తుఁ గోకలూ నవె
వలెనో విడెము నీకు వాడి మోవి తెల్లఁబారె
కలయడ మదివో కడమ యెఱఁగను

(॥చేత॥)
విసరుకొనేవో నీవు అసురును రయ్యేవు
పసనైనసుర టిదె బయలూ నదె
పొసఁగ శ్రీవేంకటేశ పొందితివి నన్ను నిట్టె
పొసఁగితి నెసఁగితి బూటకా లెఱఁగను

(||pallavi||)
sedanainabāḍi seva seyam̐galadāna niṁte
ādala nī sittamĕṭṭo adi ne nĕṟam̐ganu

(||seda||)
niddiriṁchevo kŏṁta nī kannu lĕṭranunnavi
vŏddane maṁchamū nadĕ vovarī nadĕ
tiddugŏnevo kastūri tirumaṇi sĕdarĕnu
addamidĕ mŏgamadĕ avvala yĕṟam̐ganu

(||seda||)
jalagamāḍevo nīvu sārĕ menu sĕmariṁchĕ
kŏla nadĕ taḍiyŏttum̐ gogalū navĕ
valĕno viḍĕmu nīgu vāḍi movi tĕllam̐bārĕ
kalayaḍa madivo kaḍama yĕṟam̐ganu

(||seda||)
visarugŏnevo nīvu asurunu rayyevu
pasanainasura ṭidĕ bayalū nadĕ
pŏsam̐ga śhrīveṁkaḍeśha pŏṁdidivi nannu niṭṭĕ
pŏsam̐gidi nĕsam̐gidi būḍagā lĕṟam̐ganu