చెచ్చెర నీ వ్రతమే చెల్లెఁ గాక
(॥పల్లవి॥)
చెచ్చెర నీ వ్రతమే చెల్లెఁ గాక
యిచ్చకురాల నేను యింకా నేడ సుద్దులు
(॥చెచ్చెర॥)
చేసిన నీచేఁతలకు చెక్కు నొక్కేదానఁ గాక
వేసరించి నిన్ను నంత వెంగె మాడేనా
మూసినముత్యమువలె ముంగిటికి వచ్చితివి
యీసులు నీతో నేల యింకా నేడ సుద్దులు
(॥చెచ్చెర॥)
నానాటి నీగుణాలకు నవ్వు నవ్వేదానఁ గాక
కాని మ్మని పగ చాటి కాఁక రేఁచేనా
మోనాన నా యెదుటను మోహము చల్లెటి నీపై
యేనెపము వెట్టఁగల నింకా నేడ సుద్దులు
(॥చెచ్చెర॥)
గక్కనఁ గూడినందుకు కరఁగెటిదానఁ గాక
యెక్కువతక్కువలు ని న్నెంచ వచ్చునా
చిక్కితిని నాపాలికి శ్రీవెంకటేశ్వర
యిక్కడనెవుండు నీవు యింకా నేడ సుద్దులు
(||pallavi||)
sĕchchĕra nī vradame sĕllĕm̐ gāga
yichchagurāla nenu yiṁkā neḍa suddulu
(||sĕchchĕra||)
sesina nīsem̐talagu sĕkku nŏkkedānam̐ gāga
vesariṁchi ninnu naṁta vĕṁgĕ māḍenā
mūsinamutyamuvalĕ muṁgiḍigi vachchidivi
yīsulu nīdo nela yiṁkā neḍa suddulu
(||sĕchchĕra||)
nānāḍi nīguṇālagu navvu navvedānam̐ gāga
kāni mmani paga sāḍi kām̐ka rem̐senā
monāna nā yĕduḍanu mohamu sallĕḍi nībai
yenĕbamu vĕṭṭam̐gala niṁkā neḍa suddulu
(||sĕchchĕra||)
gakkanam̐ gūḍinaṁdugu karam̐gĕḍidānam̐ gāga
yĕkkuvadakkuvalu ni nnĕṁcha vachchunā
sikkidini nābāligi śhrīvĕṁkaḍeśhvara
yikkaḍanĕvuṁḍu nīvu yiṁkā neḍa suddulu