Sebattum gumchamavai seri itte naadonu

చేపట్టుఁ గుంచమవై చేరి ఇట్టె నాతోను
Language

(॥పల్లవి॥)
చేపట్టుఁ గుంచమవై చేరి ఇట్టె నాతోను
కాఁపురము సేయవోయి గండికోటకేశవా

(॥॥)
మన్ననలనే చొక్కి మంతనాన నీవొద్ద
కిన్నెర వాయించితిఁ గెల్లురేఁగి
చన్నులపై నీవు లేఁతచందురుల నించితివి
కన్నుల మెచ్చితినోయి గండిగోటకేశవా

(॥॥)
జంటవాయలేక మోవిచవి చూపి నిన్ను నిమ్మ-
పంటఁ గొని వేసితిఁ బంతముతోను
నంటుచేసి పువ్వుదండ నాపై వేసితివి
కంటిమెయి నీజాడలు గండిగోటకేశవా

(॥॥)
కడుమంచితనములఁ గాఁగిట నిన్నెలయించి
అడరి పెండ్లాడితి నన్నిటా నిన్ను
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
కడలేదు నీమోహము గండిగోటకేశవా

(||pallavi||)
sebaṭṭum̐ guṁchamavai seri iṭṭĕ nādonu
kām̐puramu seyavoyi gaṁḍigoḍageśhavā

(||||)
mannanalane sŏkki maṁtanāna nīvŏdda
kinnĕra vāyiṁchidim̐ gĕllurem̐gi
sannulabai nīvu lem̐tasaṁdurula niṁchidivi
kannula mĕchchidinoyi gaṁḍigoḍageśhavā

(||||)
jaṁṭavāyalega movisavi sūbi ninnu nimma-
paṁṭam̐ gŏni vesidim̐ baṁtamudonu
naṁṭusesi puvvudaṁḍa nābai vesidivi
kaṁṭimĕyi nījāḍalu gaṁḍigoḍageśhavā

(||||)
kaḍumaṁchidanamulam̐ gām̐giḍa ninnĕlayiṁchi
aḍari pĕṁḍlāḍidi nanniḍā ninnu
yĕḍayaga śhrīveṁkaḍeśha nannu nelidivi
kaḍaledu nīmohamu gaṁḍigoḍageśhavā