చేపట్టి నన్నేలి చేకొంటి వీకాంతను
(॥పల్లవి॥)
చేపట్టి నన్నేలి చేకొంటి వీకాంతను
మీ పొందులు చూచి చూచి మెచ్చేరు యీ చెలులు
(॥చేప॥)
వారక వేరొకయింతివద్దికి నీ వేగఁగాను
కూరిమితోఁ బారి తెచ్చి కొంగువట్టి
గోరు చెక్కిటిపైఁ దీసి గుబ్బలు వీఁపున నూఁది
చేరఁదీసె పాన్పునకు చెప్పరాదు మోహము
(॥చేప॥)
పొరుగు మేడపై సతిఁ బొంచి నీవు చూడఁగాను
తెరవేసి నీమోవితీపు లాని
నిరతిఁ దనపాదము నీపాదముతోఁ గీలించి
సిరుల నిన్నుఁ జొక్కించె చెప్పరాదు మోహము
(॥చేప॥)
సంగడి నున్న చెలితో సన్న నీవు సేయఁగాను
రంగుగఁ బయ్యద గప్పి రతి సేసి
చెంగట నలమేల్మంగ శ్రీవేంకటేశ్వర కూడి
సింగారాన మెరసీ చెప్పరాదు మోహము
(||pallavi||)
sebaṭṭi nanneli segŏṁṭi vīgāṁtanu
mī pŏṁdulu sūsi sūsi mĕchcheru yī sĕlulu
(||seba||)
vāraga verŏgayiṁtivaddigi nī vegam̐gānu
kūrimidom̐ bāri tĕchchi kŏṁguvaṭṭi
goru sĕkkiḍibaim̐ dīsi gubbalu vīm̐puna nūm̐di
seram̐dīsĕ pānpunagu sĕpparādu mohamu
(||seba||)
pŏrugu meḍabai sadim̐ bŏṁchi nīvu sūḍam̐gānu
tĕravesi nīmovidību lāni
niradim̐ danabādamu nībādamudom̐ gīliṁchi
sirula ninnum̐ jŏkkiṁchĕ sĕpparādu mohamu
(||seba||)
saṁgaḍi nunna sĕlido sanna nīvu seyam̐gānu
raṁgugam̐ bayyada gappi radi sesi
sĕṁgaḍa nalamelmaṁga śhrīveṁkaḍeśhvara kūḍi
siṁgārāna mĕrasī sĕpparādu mohamu