Sebarayya vine nenu sevula pamduvagaanu

చెపరయ్య వినే నేను చెవుల పండువగాను
Language

(॥పల్లవి॥)
చెపరయ్య వినే నేను చెవుల పండువగాను
కుప్పళించీఁ జెమటలు కూడుకొంటిరా

(॥॥)
మంతనాన నున్నాఁడవు మగువయు నీవును
అంతరంగపు మాట లాడుకొంటిరా
వింత లేక యెనసిట్టే వేడుకతో నున్నారు
చింత దీర బాసలెల్లఁ జేసుకొంటిరా

(॥॥)
పానుపుపై నున్నాఁడవు పడఁతియు నీవును
మేనరికాలు దెలిసి మెయికొంటిరా
గానములు చేసుకొంటాఁ గళలతో నున్నవారు
కానీలే మీమనసులు కరఁగించు కొంటిరా

(॥॥)
సన్నలు చేసుకొనేవు సతియును నీవును
యిన్నేసి రతులు మీలో నెంచుకొంటిరా
నన్నుఁ గూడితివి నేఁడు ననిచి శ్రీవేంకటేశ
వున్నతితో మీరిద్దరు నొడఁబడు కొంటిరా

(||pallavi||)
sĕbarayya vine nenu sĕvula paṁḍuvagānu
kuppaḽiṁchīm̐ jĕmaḍalu kūḍugŏṁṭirā

(||||)
maṁtanāna nunnām̐ḍavu maguvayu nīvunu
aṁtaraṁgabu māḍa lāḍugŏṁṭirā
viṁta lega yĕnasiṭṭe veḍugado nunnāru
siṁta dīra bāsalĕllam̐ jesugŏṁṭirā

(||||)
pānububai nunnām̐ḍavu paḍam̐tiyu nīvunu
menarigālu dĕlisi mĕyigŏṁṭirā
gānamulu sesugŏṁṭām̐ gaḽalado nunnavāru
kānīle mīmanasulu karam̐giṁchu kŏṁṭirā

(||||)
sannalu sesugŏnevu sadiyunu nīvunu
yinnesi radulu mīlo nĕṁchugŏṁṭirā
nannum̐ gūḍidivi nem̐ḍu nanisi śhrīveṁkaḍeśha
vunnadido mīriddaru nŏḍam̐baḍu kŏṁṭirā