Se vattide raanidi sikki sannagu vachcheenaa

చే వట్టితే రానిది చిక్కి సన్నకు వచ్చీనా
Language

(॥పల్లవి॥)
చే వట్టితే రానిది చిక్కి సన్నకు వచ్చీనా
వావి దిరుగవేసితే వలపు లేమున్నది

(॥చేవ॥)
మన్నించి నీవు నాతో మాటలాడితివిగాక
నిన్నుఁ బలికించేనంటే నే నెంత దాన
చన్నులు గిలిగించితే సరి నవ్వవచ్చుగాక
కిన్నెరకాయలు గిలిగించితే నేమున్నది

(॥చేవ॥)
దయవుట్టి నీవు నాదండకు వచ్చితిగాక
నయమున నేఁ బిలువ నావశములా
ప్రియమున జౌలెఱఁగ పెద్దనాలికనేకాక
క్రియ యెఱఁగ జేతిలో కీలు మరేమున్నది

(॥చేవ॥)
కందువతో నీవు నన్నుఁగాఁ గిలించితివి గాక
అంది బలిమిసేయఁగ నంతదాననా
పొంది శ్రీవేంకటేశ నీభోగమందే వుందిగాక
అందుకోలు జాణతనా లందులో నేమున్నది

(||pallavi||)
se vaṭṭide rānidi sikki sannagu vachchīnā
vāvi dirugaveside valabu lemunnadi

(||seva||)
manniṁchi nīvu nādo māḍalāḍidivigāga
ninnum̐ baligiṁchenaṁṭe ne nĕṁta dāna
sannulu giligiṁchide sari navvavachchugāga
kinnĕragāyalu giligiṁchide nemunnadi

(||seva||)
dayavuṭṭi nīvu nādaṁḍagu vachchidigāga
nayamuna nem̐ biluva nāvaśhamulā
priyamuna jaulĕṟam̐ga pĕddanāliganegāga
kriya yĕṟam̐ga jedilo kīlu maremunnadi

(||seva||)
kaṁduvado nīvu nannum̐gām̐ giliṁchidivi gāga
aṁdi balimiseyam̐ga naṁtadānanā
pŏṁdi śhrīveṁkaḍeśha nībhogamaṁde vuṁdigāga
aṁdugolu jāṇadanā laṁdulo nemunnadi