చే వట్టి పిలువరమ్మ చెలులారా
(॥పల్లవి॥)
చే వట్టి పిలువరమ్మ చెలులారా
వేవేగఁ దా రాకున్న వేసరరా లోకులు
(॥చేపట్టి॥)
వెదకి కాకన నే విరహన నుండఁ గాను
పొదిగి తానే వచ్చుట పుణ్యము గాదా
మదిలో నేఁ దలఁచగ మరఁగున దా నుంటే
వదలక దయ లేనివాఁ డనరా లోకులు
(॥చేపట్టి॥)
తలఁచి తనకుఁ గాను తమకాన నుండఁ గాను
మలసి తాఁ బైకొంటే మంచిది గాదా
వలచినవారి నింత వలలఁ బెట్టఁగఁ బోతే
అలరి యెం తపకీర్తి యనరా లోకులు
(॥చేపట్టి॥)
తన పేరు నాలికపైఁ దడవుచు నుండఁ గాను
తనియఁ బొందుట జాణతనము గాదా
యెననె శ్రీవెంకటేశుఁ డిదివో నన్ను రతుల
పొనిగి యానోళ్లనే పొగడరా లోకులూ
(||pallavi||)
se vaṭṭi piluvaramma sĕlulārā
vevegam̐ dā rāgunna vesararā logulu
(||sebaṭṭi||)
vĕdagi kāgana ne virahana nuṁḍam̐ gānu
pŏdigi tāne vachchuḍa puṇyamu gādā
madilo nem̐ dalam̐saga maram̐guna dā nuṁṭe
vadalaga daya lenivām̐ ḍanarā logulu
(||sebaṭṭi||)
talam̐si tanagum̐ gānu tamagāna nuṁḍam̐ gānu
malasi tām̐ baigŏṁṭe maṁchidi gādā
valasinavāri niṁta valalam̐ bĕṭṭam̐gam̐ bode
alari yĕṁ tabagīrdi yanarā logulu
(||sebaṭṭi||)
tana peru nāligabaim̐ daḍavusu nuṁḍam̐ gānu
taniyam̐ bŏṁduḍa jāṇadanamu gādā
yĕnanĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍidivo nannu radula
pŏnigi yānoḽlane pŏgaḍarā logulū