Se saamsavayyaa neegum jikke gaanige

చే చాఁచవయ్యా నీకుఁ జిక్కె గానికె
Language

(॥పల్లవి॥)
చే చాఁచవయ్యా నీకుఁ జిక్కె గానికె
కాచిన పూచిన కలగంపలతో కానికె

(॥చేచా॥)
మక్కవఁ దలఁచుకొంటే మనసెల్లాఁ జిగిరించు
చెక్కు చేతఁ బెట్టితేను చింత రేగుఁను
ముక్కుమీఁద వేలిడితే ముంచును నివ్వెరగులు
యెక్కడలేని విరహమేల పెంచేవే

(॥చేచా॥)
అట్టె యెదురుచూచితే నాసలెల్లాఁ బౌకొను
నెట్టనఁ దమకించితే నిండుఁగాఁకలు
పట్టెమంచ మెక్కితేనే పరగుఁ దలపోఁతలు
దట్టముగా నెంతజోలి దవ్వుకొనేవే

(॥చేచా॥)
వుసురసురంటేను వూరకే మే నలసు
యెసఁగించితేఁ గోరిక లెలయించును
పలగా నలమేల్ మంగపతి శ్రీవేంకటేశుఁడు
వెస నిన్నుఁ గూచె నిఁక విచారములేలే

(||pallavi||)
se sām̐savayyā nīgum̐ jikkĕ gānigĕ
kāsina pūsina kalagaṁpalado kānigĕ

(||sesā||)
makkavam̐ dalam̐sugŏṁṭe manasĕllām̐ jigiriṁchu
sĕkku sedam̐ bĕṭṭidenu siṁta regum̐nu
mukkumīm̐da veliḍide muṁchunu nivvĕragulu
yĕkkaḍaleni virahamela pĕṁcheve

(||sesā||)
aṭṭĕ yĕdurusūside nāsalĕllām̐ baugŏnu
nĕṭṭanam̐ damagiṁchide niṁḍum̐gām̐kalu
paṭṭĕmaṁcha mĕkkidene paragum̐ dalabom̐talu
daṭṭamugā nĕṁtajoli davvugŏneve

(||sesā||)
vusurasuraṁṭenu vūrage me nalasu
yĕsam̐giṁchidem̐ goriga lĕlayiṁchunu
palagā nalamel maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
vĕsa ninnum̐ gūsĕ nim̐ka visāramulele