చే ముట్టఁ జుమ్మీ నీవు సేసినందుకు
(॥పల్లవి॥)
చే ముట్టఁ జుమ్మీ నీవు సేసినందుకు
యేమౌదు నే నీకు నేల మొక్కే వయ్యా
(॥॥)
నవ్వఁ జుమ్మీ నే నీతో నాఁడు నీవు రానందుకు
నవ్వులు నీ లోలోనే నవ్వుకో వయ్యా
అవ్వలి మోమైతిఁ జుమ్మీ ఆపె యింట నున్నందుకు
యెవ్వతెను నీకు నేను యేల పట్టే వయ్యా
(॥॥)
మాటాడఁ జుమ్మీ నీవు మాయలు సేసినందుకు
మాటలు నీలో నాడుకో మాతో నే లయ్యా
నీటునఁ దిట్టి తిఁ జుమ్మీ నీ సుద్దులు విన్నందుకు
యేఁ టికి బాఁ తి మమ్ము నేల చూచే వయ్యా
(॥॥)
కౌఁగిలించఁ జుమ్మీ నీవు కాఁ కలు సేసినందుకు
కౌఁ గిట నీకు నీవె కై కొనవయ్యా
వీఁగక శ్రీ వేంకటేశ వేగ నన్నుఁ గూడితివి
యేఁగుఁ బెండ్లి నేఁ డాయ నేల మెచ్చే వయ్యా.
(||pallavi||)
se muṭṭam̐ jummī nīvu sesinaṁdugu
yemaudu ne nīgu nela mŏkke vayyā
(||||)
navvam̐ jummī ne nīdo nām̐ḍu nīvu rānaṁdugu
navvulu nī lolone navvugo vayyā
avvali momaidim̐ jummī ābĕ yiṁṭa nunnaṁdugu
yĕvvadĕnu nīgu nenu yela paṭṭe vayyā
(||||)
māḍāḍam̐ jummī nīvu māyalu sesinaṁdugu
māḍalu nīlo nāḍugo mādo ne layyā
nīḍunam̐ diṭṭi tim̐ jummī nī suddulu vinnaṁdugu
yem̐ ṭigi bām̐ ti mammu nela sūse vayyā
(||||)
kaum̐giliṁcham̐ jummī nīvu kām̐ kalu sesinaṁdugu
kaum̐ giḍa nīgu nīvĕ kai kŏnavayyā
vīm̐gaga śhrī veṁkaḍeśha vega nannum̐ gūḍidivi
yem̐gum̐ bĕṁḍli nem̐ ḍāya nela mĕchche vayyā.