చే కాచుక రావయ్య చెలిని నీవు
(॥పల్లవి॥)
చే కాచుక రావయ్య చెలిని నీవు
చాకొని గోరఁ జిమ్మకు తమ్మిపువ్వువంటిది
(॥॥)
చెక్కులవెంట వడిసీ సింగారరసములు
చుక్కలు గాసీ మోవిపై సుదతికిని
చిక్కించుక పానుపుపై సేఁతలేమి సేసితివో
మిక్కిలి యలసె నీకె మించుఁదీగెవంటిది
(॥॥)
పొదిగొనీ మేననెల్లా పులకల జొంపములు
కదిమీఁ గన్నుల చెంగావితేటలు
యిదివో సరసముల నెంత పెనఁగితివో
సదమదమాయ నీకె జాజిమొగ్గవంటిది
(॥॥)
చెలరేఁగీ నుదుటిపై చికురపుఁ దుమ్మిదలు
కళలు మోమున నట్టే కారుకమ్మీని
యెలమి శ్రీవేంకటేశ యీకె నెంత గూడితివో
నిలువున జడిసీ వెన్నెలబొమ్మవంటిది
(||pallavi||)
se kāsuga rāvayya sĕlini nīvu
sāgŏni goram̐ jimmagu tammibuvvuvaṁṭidi
(||||)
sĕkkulavĕṁṭa vaḍisī siṁgārarasamulu
sukkalu gāsī movibai sudadigini
sikkiṁchuga pānububai sem̐talemi sesidivo
mikkili yalasĕ nīgĕ miṁchum̐dīgĕvaṁṭidi
(||||)
pŏdigŏnī menanĕllā pulagala jŏṁpamulu
kadimīm̐ gannula sĕṁgāvideḍalu
yidivo sarasamula nĕṁta pĕnam̐gidivo
sadamadamāya nīgĕ jājimŏggavaṁṭidi
(||||)
sĕlarem̐gī nuduḍibai sigurabum̐ dummidalu
kaḽalu momuna naṭṭe kārugammīni
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ nĕṁta gūḍidivo
niluvuna jaḍisī vĕnnĕlabŏmmavaṁṭidi