చవులు వేరె వేరె సరసులకు వలపు
(॥పల్లవి॥)
చవులు వేరె వేరె సరసులకు వలపు
యువిదలకుఁ బతుల కొక్కటే వలపు
(॥చవు॥)
కనుకలివేళను కలుగు నొక్కవలపు
వినుకలిఁ బొడమేది వేరె వలపు
అనఁగి పెనఁగేవేళ నదియు నొక్కవలపు
వొనరినప్పు డిన్నియు నొక్కటే వలపు
(॥చవు॥)
సరస మాడెటివేళ సంగతౌ నొక్కవలపు
సరి నెడమాటలది జంటవలపు
తెరమరఁగున నుండి తేలించే దొకవలపు
వొరసి మర్మ మంటితే నొక్కటే వలపు
(॥చవు॥)
వుపరతి సమరతి నుండు నొక్కవలపు
యెపుడూనుఁ దలపోఁత లేకవలపు
రప మై శ్రీవెంకటేశ రతి నన్నుఁ గూడితివి
వుపమించి చూడ నింతా నొక్కటే వలపు
(||pallavi||)
savulu verĕ verĕ sarasulagu valabu
yuvidalagum̐ badula kŏkkaḍe valabu
(||savu||)
kanugaliveḽanu kalugu nŏkkavalabu
vinugalim̐ bŏḍamedi verĕ valabu
anam̐gi pĕnam̐geveḽa nadiyu nŏkkavalabu
vŏnarinappu ḍinniyu nŏkkaḍe valabu
(||savu||)
sarasa māḍĕḍiveḽa saṁgadau nŏkkavalabu
sari nĕḍamāḍaladi jaṁṭavalabu
tĕramaram̐guna nuṁḍi teliṁche dŏgavalabu
vŏrasi marma maṁṭide nŏkkaḍe valabu
(||savu||)
vubaradi samaradi nuṁḍu nŏkkavalabu
yĕbuḍūnum̐ dalabom̐ta legavalabu
raba mai śhrīvĕṁkaḍeśha radi nannum̐ gūḍidivi
vubamiṁchi sūḍa niṁtā nŏkkaḍe valabu