Savulu sesuga neevu saaresaaregu

చవులు సేసుక నీవు సారెసారెకు
Language

(॥పల్లవి॥)
చవులు సేసుక నీవు సారెసారెకు
అవసరములతోడ నారగించవయ్యా

(॥చవులు॥)
మాటలమూటల చద్ది మనసులో చిలుపాలు
యేఁటిసేసి విందువెట్టీ నింతి నీకును
పాటలపంచదారలు పచ్చిమోవితేనెలు నీ
యాటలాయ నేఁడిట్టే ఆరగించవయ్యా

(॥చవులు॥)
జంకెనల కారాలు చవుల సాకములు
లంకెల విందులు వెట్టీ లలన నీరు
పొంకపుఁ జూపులంబళ్ళు పొరినవ్వుల పచ్చళ్ళు
అంకెలాయ నేఁడిట్టే ఆరగించవయ్యా

(॥చవులు॥)
కరజపు వినయాలు కాఁగిటి రతిబువ్వాలు
సిరులతో విందువెట్టీ శ్రీ సతి నీకు
గరిమ శ్రీ వెంకటేశ కలసితి రిద్దరును
అరుదాయ నేఁడిట్టే ఆరగించవయ్యా

(||pallavi||)
savulu sesuga nīvu sārĕsārĕgu
avasaramuladoḍa nāragiṁchavayyā

(||savulu||)
māḍalamūḍala saddi manasulo silubālu
yem̐ṭisesi viṁduvĕṭṭī niṁti nīgunu
pāḍalabaṁchadāralu pachchimovidenĕlu nī
yāḍalāya nem̐ḍiṭṭe āragiṁchavayyā

(||savulu||)
jaṁkĕnala kārālu savula sāgamulu
laṁkĕla viṁdulu vĕṭṭī lalana nīru
pŏṁkabum̐ jūbulaṁbaḽḽu pŏrinavvula pachchaḽḽu
aṁkĕlāya nem̐ḍiṭṭe āragiṁchavayyā

(||savulu||)
karajabu vinayālu kām̐giḍi radibuvvālu
sirulado viṁduvĕṭṭī śhrī sadi nīgu
garima śhrī vĕṁkaḍeśha kalasidi riddarunu
arudāya nem̐ḍiṭṭe āragiṁchavayyā