Savigaavu neevemta sadalu sesinaanu

చవిగావు నీవెంత సటలు సేసినాను
Language

(॥పల్లవి॥)
చవిగావు నీవెంత సటలు సేసినాను
తవిలి లోకులు నీకుఁ దప్పు లేదనేరా

(॥చవి॥)
యెన్నియానలు వెట్టుక యెంత వొడఁబరచినా
వెన్న నీవు దొంగిలివా వెనకకును
నన్నుఁ జూచి నీవెన్నేసి నవ్వులు నవ్వినాను
నిన్నును నీసుద్దులును నే నెఱఁగనా

(॥చవి॥)
అందరు జూఁడఁగా నీవు ఆచారాలు సేసినాను
చెంది చీఁకటితప్పులు సేయవా నీవు
యిందులోనే నాయెడకు యిచ్చక మేమిసేసినా
అందుకొని నిన్ను వెంగెమాడక వీఁగుదునా

(॥చవి॥)
మనసచ్చి నీవెంత మక్కువ నాకుఁ జేసినా
తనివోక ముట్టవా పదారువేలను
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
చనవున నీరతుల చలము విడుతునా

(||pallavi||)
savigāvu nīvĕṁta saḍalu sesinānu
tavili logulu nīgum̐ dappu ledanerā

(||savi||)
yĕnniyānalu vĕṭṭuga yĕṁta vŏḍam̐barasinā
vĕnna nīvu dŏṁgilivā vĕnagagunu
nannum̐ jūsi nīvĕnnesi navvulu navvinānu
ninnunu nīsuddulunu ne nĕṟam̐ganā

(||savi||)
aṁdaru jūm̐ḍam̐gā nīvu āsārālu sesinānu
sĕṁdi sīm̐kaḍidappulu seyavā nīvu
yiṁdulone nāyĕḍagu yichchaga memisesinā
aṁdugŏni ninnu vĕṁgĕmāḍaga vīm̐gudunā

(||savi||)
manasachchi nīvĕṁta makkuva nāgum̐ jesinā
tanivoga muṭṭavā padāruvelanu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
sanavuna nīradula salamu viḍudunā