Savigaani panulagu saaya segomte melu

చవిగాని పనులకు చాయ సేకొంటే మేలు
Language

(॥పల్లవి॥)
చవిగాని పనులకు చాయ సేకొంటే మేలు
తివిరి వో రమణుఁడ తెలుసుకో నీవే

(॥చవి॥)
కూరిమి గొసరుకంటే గట్టున నుండుటే మేలు
చేరి వేరేయొకకాంతఁ గోరేవానితో
యీరసానఁ దిట్టుకంటే యిచ్చక మాడుటే మేలు
నీరువంక తుంగవంటి నిను బోఁటితోను

(॥చవి॥)
పట్టి పెనఁగుటకంటే పరాకు సేయుటే మేలు
కట్టకడ కెందో పొయ్యేఘనునితోడ
దిట్టయై పెనఁగుకంటె దీమసాన నుంటే మేలు
పట్టరాని మొయిలువంటి బలిమి తోను

(॥చవి॥)
కౌఁగిటఁ బెనఁగుకంటే కన్నుల మొక్కుటే మేలు
రాగి యేమో తలపోయు రమణునితో
యేగి వచ్చి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
చేగలో చిగురువంటి సిగ్గరి నీతోను

(||pallavi||)
savigāni panulagu sāya segŏṁṭe melu
tiviri vo ramaṇum̐ḍa tĕlusugo nīve

(||savi||)
kūrimi gŏsarugaṁṭe gaṭṭuna nuṁḍuḍe melu
seri vereyŏgagāṁtam̐ gorevānido
yīrasānam̐ diṭṭugaṁṭe yichchaga māḍuḍe melu
nīruvaṁka tuṁgavaṁṭi ninu bom̐ṭidonu

(||savi||)
paṭṭi pĕnam̐guḍagaṁṭe parāgu seyuḍe melu
kaṭṭagaḍa kĕṁdo pŏyyeghanunidoḍa
diṭṭayai pĕnam̐gugaṁṭĕ dīmasāna nuṁṭe melu
paṭṭarāni mŏyiluvaṁṭi balimi tonu

(||savi||)
kaum̐giḍam̐ bĕnam̐gugaṁṭe kannula mŏkkuḍe melu
rāgi yemo talaboyu ramaṇunido
yegi vachchi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
segalo siguruvaṁṭi siggari nīdonu