(॥పల్లవి॥)
చవిగాని పనికేల సాదించేరే
కవగూడినవా రింకఁ గాదంటే వినేరా
(॥చవి॥)
యొగ్గులు- సిగ్గులు లేవు యెనసినవారికి
అగ్గలముగఁ గూడేటియాసలే కాని
వొగ్గి మీ రేల చెప్పేరే వూరఁగలబుద్దులెల్లా
అగ్గలపు వారిద్దరి కవి యితవవునా
(॥చవి॥)
చింతలు-వంతలు లేవు చేకొన్నవారికి
వింతలుగా నవ్వునవ్వేవేడుకే కాని
వంతుకు మీరందుకేల వంక లొత్తఁబొయ్యేరే
వంతపు వారివి నేఁడు పాటివట్టేరా
(॥చవి॥)
కడమఁదొడను లేవి కలసినవారికి
వుడివోని రతులలో వొద్దికే కాని
అడరి శ్రీ వేంకటేశుఁ డాపె నొక్కటి
యెడమాటలేలే వారు యెఱఁగని వున్నవా
(||pallavi||)
savigāni panigela sādiṁchere
kavagūḍinavā riṁkam̐ gādaṁṭe vinerā
(||savi||)
yŏggulu- siggulu levu yĕnasinavārigi
aggalamugam̐ gūḍeḍiyāsale kāni
vŏggi mī rela sĕppere vūram̐galabuddulĕllā
aggalabu vāriddari kavi yidavavunā
(||savi||)
siṁtalu-vaṁtalu levu segŏnnavārigi
viṁtalugā navvunavveveḍuge kāni
vaṁtugu mīraṁdugela vaṁka lŏttam̐bŏyyere
vaṁtabu vārivi nem̐ḍu pāḍivaṭṭerā
(||savi||)
kaḍamam̐dŏḍanu levi kalasinavārigi
vuḍivoni radulalo vŏddige kāni
aḍari śhrī veṁkaḍeśhum̐ ḍābĕ nŏkkaḍi
yĕḍamāḍalele vāru yĕṟam̐gani vunnavā