Savi gamti (te?)viduvamdu saare saare nebanulu

చవి గంటి (టే?)విడువఁడు సారె సారె నేపనులు
Language

(॥పల్లవి॥)
చవి గంటి (టే?)విడువఁడు సారె సారె నేపనులు
యివల నీతని పొందులెట్టు సేసేదే

(॥చవి॥)
పాలమీఁదఁ బవ్వళించి పాల వారి యింటఁ బుట్టి
పాలు దొంగిలించినట్టి బాలుఁడీతఁడు
గాలికూటివాని మెట్టి గాలి రాకాసునిఁ గొట్టి
గాలిబిడ్డ తమ్ముని సంగడి నాడె నీతఁడు

(॥చవి॥)
పసుల యేలిక నేలి పసులకు మారు దెచ్చి
పసులఁ గాచిన యట్టి బాలుఁడీతఁడు
వసుధ భారము దించి వసుధ కొడుకుఁ గొట్టి
వసుధ యేలిన యట్టి వాఁడు గదె వీఁడు

(॥చవి॥)
బండి బోయుఁడైవచ్చి బండి గాలి కత్తి వట్టి
బండి విఱచినయట్టి బాలుఁడీతఁడు
కొండ యెత్తి కొండ దచ్చి గురుతై శ్రీ వేంకటాద్రి
కొండపై నలమేల్ మంగఁ గూడినాఁడితడు

(||pallavi||)
savi gaṁṭi (ṭe?)viḍuvam̐ḍu sārĕ sārĕ nebanulu
yivala nīdani pŏṁdulĕṭṭu sesede

(||savi||)
pālamīm̐dam̐ bavvaḽiṁchi pāla vāri yiṁṭam̐ buṭṭi
pālu dŏṁgiliṁchinaṭṭi bālum̐ḍīdam̐ḍu
gāligūḍivāni mĕṭṭi gāli rāgāsunim̐ gŏṭṭi
gālibiḍḍa tammuni saṁgaḍi nāḍĕ nīdam̐ḍu

(||savi||)
pasula yeliga neli pasulagu māru dĕchchi
pasulam̐ gāsina yaṭṭi bālum̐ḍīdam̐ḍu
vasudha bhāramu diṁchi vasudha kŏḍugum̐ gŏṭṭi
vasudha yelina yaṭṭi vām̐ḍu gadĕ vīm̐ḍu

(||savi||)
baṁḍi boyum̐ḍaivachchi baṁḍi gāli katti vaṭṭi
baṁḍi viṟasinayaṭṭi bālum̐ḍīdam̐ḍu
kŏṁḍa yĕtti kŏṁḍa dachchi gurudai śhrī veṁkaḍādri
kŏṁḍabai nalamel maṁgam̐ gūḍinām̐ḍidaḍu