సవతులమైనా నేమి సమ్మతించితిమి నేము
(॥పల్లవి॥)
సవతులమైనా నేమి సమ్మతించితిమి నేము
జవళి సరసములు సరినెంత వేడుకో
(॥సవ॥)
మాటలాడఁగదవే మనసిచ్చి పతితోను
యేఁటికి సిగ్గులువడే వెవ్వరున్నారు
సూటిగా వినఁగదవే సుద్దులు చెప్పీ నతఁడు
నీటున నెమ్మె నెరప నీతో నెంతవేడుకో
(॥సవ॥)
జఱసి కూచుండఁగదే సన్నలు సేసీఁ దాను
చిఱునవ్వు నవ్వనేల చిన్న దానవా
నెఱులుదువ్వించుకోవే నేరుతుననీ నితఁడు
తఱితోఁ దొడయెక్కవే తన కెంతవేడుకో
(॥సవ॥)
ఇట్టె అందుకోవే విడెమిచ్చీ శ్రీవేంకటేశుఁడు
గుట్టు సేయకిఁక నీకు కొంకు దేరెను
నెట్టన నన్నుఁ గూడి నీపైఁ జేతులు చాఁచీ
దట్టపుటాసలతో బొందఁగ నెంత వేడుకో
(||pallavi||)
savadulamainā nemi sammadiṁchidimi nemu
javaḽi sarasamulu sarinĕṁta veḍugo
(||sava||)
māḍalāḍam̐gadave manasichchi padidonu
yem̐ṭigi sigguluvaḍe vĕvvarunnāru
sūḍigā vinam̐gadave suddulu sĕppī nadam̐ḍu
nīḍuna nĕmmĕ nĕraba nīdo nĕṁtaveḍugo
(||sava||)
jaṟasi kūsuṁḍam̐gade sannalu sesīm̐ dānu
siṟunavvu navvanela sinna dānavā
nĕṟuluduvviṁchugove nerudunanī nidam̐ḍu
taṟidom̐ dŏḍayĕkkave tana kĕṁtaveḍugo
(||sava||)
iṭṭĕ aṁdugove viḍĕmichchī śhrīveṁkaḍeśhum̐ḍu
guṭṭu seyagim̐ka nīgu kŏṁku derĕnu
nĕṭṭana nannum̐ gūḍi nībaim̐ jedulu sām̐sī
daṭṭabuḍāsalado bŏṁdam̐ga nĕṁta veḍugo