Savadulamaina nemu saadimchaga maanaraadu

సవతులమైన నేము సాదించక మానరాదు
Language

(॥పల్లవి॥)
సవతులమైన నేము సాదించక మానరాదు
పవళించి నీవొకతె పాలికే వచ్చునా

(॥సవ॥)
తెల్లవారి జామెక్కె తేనెలు గారీ మోవి
యెల్లవారుఁ గాఁపురాలు యిట్టె సేతురా
ఇల్లు వెళ్లఁడంటాఁ బతి కిచ్చేవు విడేలు
యిల్లాండ్లైనవారి నింతులెల్లా నవ్వరా

(॥సవ॥)
కలయ నెండలుగాసె కావి దేరీఁ గన్నులను
యెలమి నీవంటివారి నిటు చూడవా
అలసెనంటా బోనా లక్కడనే పట్టేవు
చలివాసి గరితలసరిత నిట్టేయా

(॥సవ॥)
పొద్దు మద్యాన్నమాయను భోగాలు మరిఁగితివి
అద్దో లోకము మెచ్చ నణఁకు వొద్దా
బుద్దితో నీరేతిరి పొందఁడా శ్రీ వేంకటేశుఁ
డి ద(ద్ద)రు గేస్తురాండ్లమే యెంచుకోరా చెలులు

(||pallavi||)
savadulamaina nemu sādiṁchaga mānarādu
pavaḽiṁchi nīvŏgadĕ pālige vachchunā

(||sava||)
tĕllavāri jāmĕkkĕ tenĕlu gārī movi
yĕllavārum̐ gām̐purālu yiṭṭĕ sedurā
illu vĕḽlam̐ḍaṁṭām̐ badi kichchevu viḍelu
yillāṁḍlainavāri niṁtulĕllā navvarā

(||sava||)
kalaya nĕṁḍalugāsĕ kāvi derīm̐ gannulanu
yĕlami nīvaṁṭivāri niḍu sūḍavā
alasĕnaṁṭā bonā lakkaḍane paṭṭevu
salivāsi garidalasarida niṭṭeyā

(||sava||)
pŏddu madyānnamāyanu bhogālu marim̐gidivi
addo logamu mĕchcha naṇam̐ku vŏddā
buddido nīrediri pŏṁdam̐ḍā śhrī veṁkaḍeśhum̐
ḍi da(dda)ru gesturāṁḍlame yĕṁchugorā sĕlulu