Savadulainavaaru saddaseduraa

సవతులైనవారు సడ్డసేతురా
Language

(॥పల్లవి॥)
సవతులైనవారు సడ్డసేతురా
రవళితో నీవేల రాఁపు సేసేవే

(॥సవతు॥)
మాట లెన్ని యాడినాను మరి సేసినట్టుగాదు
నీటు లెంత చూపినాను నేర్పురాదు
యేఁటికిఁ బంతాలాడేవే యీతఁడు నాకు వలచు
కాటుకన్నుల నెంత కాఁడఁ జూచేవే

(॥సవతు॥)
గయ్యాళితనాలవంకఁ గట్టుకొనే దేమున్నది
సయ్యాటలఁ బెనఁగితే సాదించేదేమి
కొయ్యతనాలు నీకేల కోరి నామగఁ డితఁడు
చేయత్తి చూపియేల చెలులకుఁ జెప్పవే

(॥సవతు॥)
పంతాలకు బిగిసేవు ఫలమేమి గంటివే
వంతులకుఁ దగిలితే వాసి వచ్చునా
చెంత నలమేల్ మంగను శ్రీవేంకటేశుఁ డితఁడు
బంతినే నన్నేలినాఁడు బయలేల యీఁదేవే

(||pallavi||)
savadulainavāru saḍḍasedurā
ravaḽido nīvela rām̐pu seseve

(||savadu||)
māḍa lĕnni yāḍinānu mari sesinaṭṭugādu
nīḍu lĕṁta sūbinānu nerburādu
yem̐ṭigim̐ baṁtālāḍeve yīdam̐ḍu nāgu valasu
kāḍugannula nĕṁta kām̐ḍam̐ jūseve

(||savadu||)
gayyāḽidanālavaṁkam̐ gaṭṭugŏne demunnadi
sayyāḍalam̐ bĕnam̐gide sādiṁchedemi
kŏyyadanālu nīgela kori nāmagam̐ ḍidam̐ḍu
seyatti sūbiyela sĕlulagum̐ jĕppave

(||savadu||)
paṁtālagu bigisevu phalamemi gaṁṭive
vaṁtulagum̐ dagilide vāsi vachchunā
sĕṁta nalamel maṁganu śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu
baṁtine nannelinām̐ḍu bayalela yīm̐deve