సవతుల మింతే సరుసల నుంటిమి
(॥పల్లవి॥)
సవతుల మింతే సరుసల నుంటిమి
దవనపు వాట్లు తా నెఱుఁగు
(॥సవ॥)
మగువకుఁ దనకును మాన్పితి జగడము
తగవును ధర్మము తానెఱుఁగు
పగటు లేఁటివో పంతము లేఁటివో
తగులువిరులే యవి తా నెఱుఁగు
(॥సవ॥)
విరసపుసొట్లు విడుపుమంటి మిటు
తరవాతిపనులు తా నెఱుఁగు
సరసతలో యవి జాణతనములో
తరఁగులు మొరఁగులు తా నెఱుఁగు
(॥సవ॥)
జమళి నిద్దరిని సంగడిఁ గూర్చితి
తమకము సముకముఁదా నెఱుఁగు
భ్రమసి శ్రీవేంకటపతి నను నేలెను
తముల మెవ్వరిదో తా నెఱుఁగు
(||pallavi||)
savadula miṁte sarusala nuṁṭimi
davanabu vāṭlu tā nĕṟum̐gu
(||sava||)
maguvagum̐ danagunu mānpidi jagaḍamu
tagavunu dharmamu tānĕṟum̐gu
pagaḍu lem̐ṭivo paṁtamu lem̐ṭivo
taguluvirule yavi tā nĕṟum̐gu
(||sava||)
virasabusŏṭlu viḍubumaṁṭi miḍu
taravādibanulu tā nĕṟum̐gu
sarasadalo yavi jāṇadanamulo
taram̐gulu mŏram̐gulu tā nĕṟum̐gu
(||sava||)
jamaḽi niddarini saṁgaḍim̐ gūrsidi
tamagamu samugamum̐dā nĕṟum̐gu
bhramasi śhrīveṁkaḍabadi nanu nelĕnu
tamula mĕvvarido tā nĕṟum̐gu