Savadula mimte nemu sadalagu lonayyemaa

సవతుల మింతే నేము సటలకు లోనయ్యేమా
Language

(॥పల్లవి॥)
సవతుల మింతే నేము సటలకు లోనయ్యేమా
రవళితో నేము మిమ్ము రవ్వ సేసేమా

(॥సవ॥)
యీకడ నాకడాను యెదురుబడి బాసలు
ఆకెకు నీకే తగు నందు కేమయ్యా
సాకిరులేల పెట్టేవు సతులెరిఁగినపనే
దీకొనిమీగుణములు తిప్పవచ్చేమా

(॥సవ॥)
మత కాన మీలోనిమారుకుమారు నవ్వులు
అతివు నీకే తగు నందు కేమయ్య
చతురతేమిచూపేవు చల్లఁగా నన్నీఁ గంటిమి
కతకారిమీసుద్దులు కదనఁగలమా

(॥సవ॥)
ముందువెనకలఁ గూడేముయికిముయిరతులు
అందములే ఇద్దరికి నందుకేమయ్య
సందడి శ్రీ వేంకటేశ సరిగాఁ గూడితి మమ్ము
పందెమాడి మిమ్మునేముపచ్చిసేసేమా

(||pallavi||)
savadula miṁte nemu saḍalagu lonayyemā
ravaḽido nemu mimmu ravva sesemā

(||sava||)
yīgaḍa nāgaḍānu yĕdurubaḍi bāsalu
āgĕgu nīge tagu naṁdu kemayyā
sāgirulela pĕṭṭevu sadulĕrim̐ginabane
dīgŏnimīguṇamulu tippavachchemā

(||sava||)
mada kāna mīlonimārugumāru navvulu
adivu nīge tagu naṁdu kemayya
sadurademisūbevu sallam̐gā nannīm̐ gaṁṭimi
kadagārimīsuddulu kadanam̐galamā

(||sava||)
muṁduvĕnagalam̐ gūḍemuyigimuyiradulu
aṁdamule iddarigi naṁdugemayya
saṁdaḍi śhrī veṁkaḍeśha sarigām̐ gūḍidi mammu
paṁdĕmāḍi mimmunemubachchisesemā