సవతుల కీమాఁట సమ్మతిగాదు గాని
(॥పల్లవి॥)
సవతుల కీమాఁట సమ్మతిగాదు గాని
యివల నీవెటుండినా నిఁక నేఁ గాదనేనా
(॥సవ॥)
వద్దు నా కేమి చెప్పేవే వలచు నీ కాతఁడంటా
కద్దులేవే నీమాఁట కల్లఁగాదు
సుద్దులెల్లా వింటి నాఁడే సోద్యము గాదు నాకు
అద్దో నీ పెద్దరిక మందరు నెఱఁగరా
(॥సవ॥)
చూపనేలే నీ కాతఁడు సొమ్ము లిచ్చె నంటాను
యేపున నీకుఁ దగునే ఇటువంటివి
వైపాయ నీ సింగారము వడి సంతోసించుకొంటి
ఆపాటి నీ దొరతన మందరు నెఱఁగరా
(॥సవ॥)
పెట్టేవేమే విడేలు పెండ్లాడె నిన్నాతఁడంటా
గుట్టుగలవారి కిదే గుణముగాదా
యిట్టె శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
అట్టేకాదా మీపొందు నేఁ డందరు నెఱఁగరా
(||pallavi||)
savadula kīmām̐ṭa sammadigādu gāni
yivala nīvĕḍuṁḍinā nim̐ka nem̐ gādanenā
(||sava||)
vaddu nā kemi sĕppeve valasu nī kādam̐ḍaṁṭā
kadduleve nīmām̐ṭa kallam̐gādu
suddulĕllā viṁṭi nām̐ḍe sodyamu gādu nāgu
addo nī pĕddariga maṁdaru nĕṟam̐garā
(||sava||)
sūbanele nī kādam̐ḍu sŏmmu lichchĕ naṁṭānu
yebuna nīgum̐ dagune iḍuvaṁṭivi
vaibāya nī siṁgāramu vaḍi saṁtosiṁchugŏṁṭi
ābāḍi nī dŏradana maṁdaru nĕṟam̐garā
(||sava||)
pĕṭṭeveme viḍelu pĕṁḍlāḍĕ ninnādam̐ḍaṁṭā
guṭṭugalavāri kide guṇamugādā
yiṭṭĕ śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
aṭṭegādā mībŏṁdu nem̐ ḍaṁdaru nĕṟam̐garā