Savadu limdaru ninnu samtosimcheride

సవతు లిందరు నిన్ను సంతోసించేరిదె
Language

(॥పల్లవి॥)
సవతు లిందరు నిన్ను సంతోసించేరిదె
రవళి నౌభళేశుని రాణి వౌదువమ్మా

(॥సవ॥)
ఆతనిమోము చూచితివదె తొడ యెక్కితివి
నీతి నీవెఱుఁగుదువు నీకేమమ్మా
ఆతుమార రమణుని అలుకెల్లఁ దీర్చితివి
రాతిరిఁ బగలు నట్టె రాజ్యమేలవమ్మా

(॥సవ॥)
వాసిఁ బంతాలాడితివి వలపించితి విభుని
నీ సరి గారెవ్వరున్ నీకేమమ్మా
సేస వెట్టి చెప్పినట్టు సేయించుకొంటి పనులు
ఆసఁ బట్టము గట్టుక అండనుండవమ్మా

(॥సవ॥)
ప్రియమునుఁ జెప్పితివి బిగ్గె గాఁగిలించితివి
నియతి నో లకిమమ్మ నీకేమమ్మా
దయతో శ్రీ వేంకటాద్రిఁ దమకించి కూడితివి
నయమై నరసింహాసనాన మించవమ్మా

(||pallavi||)
savadu liṁdaru ninnu saṁtosiṁcheridĕ
ravaḽi naubhaḽeśhuni rāṇi vauduvammā

(||sava||)
ādanimomu sūsidivadĕ tŏḍa yĕkkidivi
nīdi nīvĕṟum̐guduvu nīgemammā
ādumāra ramaṇuni alugĕllam̐ dīrsidivi
rādirim̐ bagalu naṭṭĕ rājyamelavammā

(||sava||)
vāsim̐ baṁtālāḍidivi valabiṁchidi vibhuni
nī sari gārĕvvarun nīgemammā
sesa vĕṭṭi sĕppinaṭṭu seyiṁchugŏṁṭi panulu
āsam̐ baṭṭamu gaṭṭuga aṁḍanuṁḍavammā

(||sava||)
priyamunum̐ jĕppidivi biggĕ gām̐giliṁchidivi
niyadi no lagimamma nīgemammā
dayado śhrī veṁkaḍādrim̐ damagiṁchi kūḍidivi
nayamai narasiṁhāsanāna miṁchavammā