Savadiganaga nee jaadalellaam gaanavachche

సవతిగనక నీ జాడలెల్లాఁ గానవచ్చె
Language

(॥పల్లవి॥)
సవతిగనక నీ జాడలెల్లాఁ గానవచ్చె
జవళి మా పొందు లివి సతమాయ నిపుడు

(॥సవ॥)
కాంతుఁడు నేనూఁ దారుకాణకు వచ్చితే నీవు
సంతసాకిరి చెప్పేవు జాణవౌదువే
వంతుల నిద్దరికిని వావి గూడునాయంటే
పంతము కొలఁదనేవు బాపురే నీవు

(॥సవ॥)
వొల్లనే మాలో బాసలవొడఁబా టడిగితే
గొల్లదోమటి సేసేవు గుణివౌదువే
ఇల్లిదె వొండొరులకు నీడౌనా యని యంటే
చెల్లుబడెంతేయనేవు చెప్పరాదె నీవు

(॥సవ॥)
నమ్మి శ్రీవేంకటేశ్వరు నన్నుఁ గూరుచుమంటేను
దొమ్మి నవ్వులు నవ్వేవు దొరవౌదువే
సమ్మతించి నేమే కూడి సరివయసులాయంటే
మిమ్ముఁ జూచుకొమ్మనేవు మేలుమేలే నీవు

(||pallavi||)
savadiganaga nī jāḍalĕllām̐ gānavachchĕ
javaḽi mā pŏṁdu livi sadamāya nibuḍu

(||sava||)
kāṁtum̐ḍu nenūm̐ dārugāṇagu vachchide nīvu
saṁtasāgiri sĕppevu jāṇavauduve
vaṁtula niddarigini vāvi gūḍunāyaṁṭe
paṁtamu kŏlam̐danevu bābure nīvu

(||sava||)
vŏllane mālo bāsalavŏḍam̐bā ṭaḍigide
gŏlladomaḍi sesevu guṇivauduve
illidĕ vŏṁḍŏrulagu nīḍaunā yani yaṁṭe
sĕllubaḍĕṁteyanevu sĕpparādĕ nīvu

(||sava||)
nammi śhrīveṁkaḍeśhvaru nannum̐ gūrusumaṁṭenu
dŏmmi navvulu navvevu dŏravauduve
sammadiṁchi neme kūḍi sarivayasulāyaṁṭe
mimmum̐ jūsugŏmmanevu melumele nīvu