(॥పల్లవి॥)
సవతిపోరుల కోపఁజాలనయ్యా
జవళితో నీకు మొక్కే సమ్మతించవయ్యా
(॥సవతి॥)
గచ్చురేఁగి నీవే యింకాఁ గొన్ని దిట్టవయ్యా
మచ్చరాలు నీతోను మాకేలయ్యా
చెచ్చెర నీ కూడిగాలు సే సేవా రుండఁగాను
నిచ్చలుఁ బయికొసరు నే నేలయ్యా
(॥సవతి॥)
కలవి లేనివి నీవే గడియించుకోవయ్య
మలసి నీతోఁ బలుక మాకేలయ్య
తలఁ పొక్కట నుండఁగ దగ్గరనేఁటికి మమ్ము
వలపులు చప్పనాయ వద్దేలయ్యా
(॥సవతి॥)
కందువ దెలసి నీవే కయికొని కూడవయ్య
మందెమేళానఁ జెనక మాకేలయ్యా
యిందులోన శ్రీవేంకటేశ నీకు లోనైతి
సందడిఁ బెండ్లాడితివి జాణ వవుదువయ్యా
(||pallavi||)
savadiborula kobam̐jālanayyā
javaḽido nīgu mŏkke sammadiṁchavayyā
(||savadi||)
gachchurem̐gi nīve yiṁkām̐ gŏnni diṭṭavayyā
machcharālu nīdonu māgelayyā
sĕchchĕra nī kūḍigālu se sevā ruṁḍam̐gānu
nichchalum̐ bayigŏsaru ne nelayyā
(||savadi||)
kalavi lenivi nīve gaḍiyiṁchugovayya
malasi nīdom̐ baluga māgelayya
talam̐ pŏkkaḍa nuṁḍam̐ga daggaranem̐ṭigi mammu
valabulu sappanāya vaddelayyā
(||savadi||)
kaṁduva dĕlasi nīve kayigŏni kūḍavayya
maṁdĕmeḽānam̐ jĕnaga māgelayyā
yiṁdulona śhrīveṁkaḍeśha nīgu lonaidi
saṁdaḍim̐ bĕṁḍlāḍidivi jāṇa vavuduvayyā